ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

True Friend : అసలైన స్నేహితుడు!

ABN, First Publish Date - 2022-11-02T22:48:37+05:30

అడవిలోని ఓ చెట్టుకు ఎలుక, కుందేలు ఊయలూగుతున్నారు. గట్టిగా ఊగుతుంటే.. ఎలుక పొరబాటున ఏనుగు మీద పడింది. ఏనుగు నిద్ర భంగమైంది. కోపంతో...

A true friend
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడవిలోని ఓ చెట్టుకు ఎలుక, కుందేలు ఊయలూగుతున్నారు. గట్టిగా ఊగుతుంటే.. ఎలుక పొరబాటున ఏనుగు మీద పడింది. ఏనుగు నిద్ర భంగమైంది. కోపంతో... ఎలుకను పట్టుకుంది. అంతలోనే ‘నేను బతకాలి కదా’ అంటూ కుందేలు చెట్టు వెనక్కి వెళ్లిపోయింది. అది చూసి ఎలుక బాధపడింది. ఆలోపు తప్పుచేశాను వదిలేయ్‌ అన్నది ఎలుక. నాకు నిద్ర చెడిపోయింది అన్నది ఏనుగు. అంతలోనే ‘దెబ్బ తగల్లేదు కదా.. నీ మీద రాజుగారికి ఫిర్యాదు చేస్తానం’ది కుందేలు. ‘దెబ్బతగలకపోయినా.. నాకు నిద్ర చెడింది’ అంటూ మరోసారి అలానే మాట్లాడింది ఏనుగు. కొద్దిసేపటి తర్వాత ఎలుకను తొక్కేస్తాను అన్నది కుందేలుతో. ‘సరే అలానే చేయి. ఒకవారం సమయం ఇవ్వు’ అన్నది కుందేలు. ఎలుక బాధపడింది. నీలాంటి బద్ధ శతృవుతో తిరిగానా? అంటూ ఎలుక తీవ్రంగా తిట్టింది. ఎలుకను కుందేలు ఇంటికి తీసుకెళ్లింది. చెవిలో ఓ ఉపాయం చెప్పింది.

రాజుగారికి ఈ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులు అయ్యాయి. అందరూ వెయిట్‌ చేస్తున్నారు. షేర్‌ఖాన్‌ కూడా వచ్చారు. రాజుగారి ముందే ఎలుకమీద కాలు పెట్టడానికి ఏనుగు సిద్ధమైంది. అందరూ ఎలుక పచ్చడి అయింది ఇక..అంటూ గుసగుసలాడుతున్నారు. ఏనుగు కాలు పెట్టడానికి సిద్ధమయ్యే లోపు అక్కడ మెల్లగా మట్టి కాళ్లతో తోడింది. కాలు పెట్టేసింది. అందరూ అయ్యో పాపం.. అన్నారు. ఏనుగు కాస్త పక్కకు పోయింది. ఎలుక బొరియలోంచి బయటకు వచ్చింది. ఏనుగు కోప్పడింది. మోసం అన్నది. అప్పుడు కుందేలు రాజుగారితో ఇలా అంది. ‘రాజుగారూ.. నా మిత్రుడి మీద పాదం పెడతానన్నారు ఏనుగు. చేశారు’ అన్నది. ‘ఓహో.. శభాష్‌ కుందేలా! ఇందుకా నువ్వు వారం రోజులు సమయం తీసకున్నది. భలే భలే’ అన్నారు. కుందేలు సంతోషపడింది. కుందేలు స్నేహితుడు అయిన ఎలుక ఆనందానికి అవధుల్లేవు. ‘అసలైన స్నేహితుడు’ అంటే కుందేలు అని అడవిలోని జంతువులన్నీ అనుకున్నాయి.

Updated Date - 2022-11-02T22:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising