story telling for kids : రోజూ పడుకునే సమయంలో పిల్లలకు కథలు చెబుతున్నారా..?
ABN, First Publish Date - 2022-10-28T11:49:45+05:30
రోజంతా హడావుడిగా ఉద్యోగాలతో కాలం గడిపే తల్లిదండ్రులు రాత్రి పిల్లలు పడుకునే సమయాన్ని వాళ్ళతో గడపడం మానేస్తున్నారు.
మన చిన్నతనంలో బామ్మలు, నాయనమ్ములు కథలు చెప్పి నిద్రపుచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రోజంతా హడావుడిగా ఉద్యోగాలతో కాలం గడిపే తల్లిదండ్రులు రాత్రి పిల్లలు పడుకునే సమయాన్ని వాళ్ళతో గడపడం మానేస్తున్నారు. ఇది వాళ్ళలో ఒంటరితనాన్ని, నిరాశను కలిగిస్తుంది. అదే పిల్లలతో పడుకునే సమయాన్ని గడపితే కలిగే ప్రయోజనాలెలా ఉంటాయో చూడండి.
బాల్యం నుంచి నిద్రవేళలో పిల్లలకు కథలు చెప్పే ధోరణి శతాబ్దాలుగా మనలో ఉంది. అమ్మమ్మలు, నాయనమ్మలు రాత్రి పూట పిల్లలకు కథలు చెప్పేవారు. ఇప్పుడు ఈ స్థానాన్ని మొబైల్ ఆక్రమించేస్తుంది. కథలు చెప్పే ధోరణి కూడా తగ్గింది. రోజంతా బిజీ లైఫ్ గడిపి పిల్లలతో సమయం గడపలేని తల్లిదండ్రులుగా మిగిలుతున్నారు.
అసలు పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఏం ప్రయోజనాలు ఏమిటి?
కథలు చెప్పడం వల్ల పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం మెరుగవుతుంది. కాబట్టి అదే సమయంలో పిల్లల మానసిక వికాశానికి కూడా కథలు దోహదం చేస్తాయి.
నిద్ర సహాయాలు..
సాధారణంగా పిల్లలు నిద్రపోయే ముందు ఫోన్ లేదా వీడియో గేమ్స్ ఆడేందుకు ఇష్టపడతారు. దీనివల్ల వారికి ఆలస్యంగా నిద్ర వస్తుంది. అదే సమయంలో నిద్రలేకపోవడం కూడా మొదలవుతుంది. దీనికి కారణం ఎక్కువ సమయం పాటు బ్లూ స్క్రీన్ ను చూడటం వల్ల నిద్ర పట్టే సమయం తగ్గుతుంది. అదే పడుకోవడానికి రెండు గంటల ముందు నుంచి పిల్లలు కథలు, కబుర్లతో సమయం గడిపితే త్వరగా, గాఢమైన నిద్రలోకి జారుకుంటారు.
ఏకాగ్రత పెరుగుతుంది.
కథలు చెప్పేటప్పుడు పిల్లల ధ్యాస అంతా కేవలం కథపైనే ఉండాలి. రోజూ కథలు వినడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత శక్తి పెరుగుతుంది.
ఊహా శక్తి పెరుగుతుంది.
కథ చెప్పేటప్పుడు పిల్లలు కథల్లో లీనమైపోవడమే కాకుండా కథను ముందుగానే ఊహిస్తారు. దానివల్ల వాళ్ళల్లో ఆలోచనా శక్తితోపాటు ఊహాశక్తి కూడా పెరుగుతుంది. అది పెరిగే కొద్దీ బలంగా మారుతుంది.
పిల్లలు కథలతో సృజనాత్మకంగా మారతారు.
కథలు చెప్పేటప్పుడు పిల్లలు కథలోని అన్ని అంశాలను తీసుకుంటారు. అలాగే పిల్లలు ఈ కథలనుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. చిన్నపిల్లల మెదళ్ళకు పదునుపెట్టే కాశీమజిలీ కథలు, చందమామ కథలు, సాహసవీరుల కథలు ఇలా రకాల కథలను వాళ్ళకు చెప్పడం వల్ల మన సంస్కృతి వారికి పంచిన వారమవుత
Updated Date - 2022-10-28T13:24:01+05:30 IST