Grizzly bear : మీకు తెలుసా?
ABN, First Publish Date - 2022-12-01T23:40:56+05:30
ప్రమాదకరమైన జంతువుల్లో గ్రిజ్లీ ఎలుగుబంటి ఒకటి. లాటిన్ భాషలో గ్రిజ్లీ అంటే ‘హారిబుల్’ అని అర్థం. ముక్కునుంచి తోక వరకూ ఎనిమిది అడుగుల పొడవు ఉంటుంది. 360 కేజీల బరువు ఉంటుంది.
ప్రమాదకరమైన జంతువుల్లో గ్రిజ్లీ ఎలుగుబంటి ఒకటి. లాటిన్ భాషలో గ్రిజ్లీ అంటే ‘హారిబుల్’ అని అర్థం. ముక్కునుంచి తోక వరకూ ఎనిమిది అడుగుల పొడవు ఉంటుంది. 360 కేజీల బరువు ఉంటుంది.
నార్త్‌వెస్ట్ అమెరికా, కెనడాలో ఉండే ఈ ఎలుగుబంట్లు తెలివైనవి. ఎంత అంటే పదేళ్ల కితం తాను ఆహారం తిన్న ప్రాంతాన్ని అవి గుర్తుంచుకోగలవు. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే... ఒక జీవిని గుర్తుపెట్టుకోవటమే కాదు మనుషులు లేదా ఇతర జంతువుల పాదాల గుర్తులను గమనించి జాగ్రత్తపడతాయి.
ఇవి అడవికుక్కలకంటే అద్భుతంగా ఇతర జీవుల వాసనను దూరంనుంచే పసిగట్టగలవు.
ఇవి వేగంగా పరిగెత్తుతాయి. చెట్లు ఎక్కుతాయి. అత్యంత వేగంగా ఈతకొడతాయి.
ఇవి 90 శాతం శాకాహారులు. ఇవి విత్తనాలు, గింజలు, ఆకులు, దుంపలుతో పాటు సీజనల్‌గా పండే పండ్లను తినటానికి ఇష్టపడతాయి. ఇక 20 శాతం ఎలుగుబంట్లు మాత్రం మాంసాహారంతో పాటు తోటి ఎలుగుబంట్లను కూడా చంపి తినేస్తాయి. ముఖ్యంగా మగ ఎలుగుబంట్లు ఆధిపత్యంతో ఉంటాయి. దీంతో పాటు అవి చిన్న ఎలుగుబంట్లను చంపి తినేస్తాయి.
నాలుగు ఇంచులుండే వీటి పంజా దెబ్బ పడితే అంతే సంగతులు. కొండ ప్రాంతాలను సులువుగా ఎక్కుతాయి. రాళ్లమధ్య గుంతలాగా తవ్వి అక్కడే ఆవాసం ఏర్పరచుకుంటాయి. భయపడినపుడు, అవతలి జీవితో ప్రమాదం అనుకున్న సమయాల్లోనే అవి దాడి చేస్తాయి. ఇవి కనీసం 25 ఏళ్లు జీవిస్తాయి.
Updated Date - 2022-12-01T23:40:57+05:30 IST