New Year : పలు దేశాల్లో... ‘న్యూ’ ఇయర్!
ABN, First Publish Date - 2022-12-31T23:05:33+05:30
వాస్తవానికి న్యూ ఇయర్ అనే కాన్సెప్ట్ రోమ్‌లో తొలిసారిగా ప్రారంభమైంది. ఇక అమెరికాలో న్యూ ఇయర్‌ను స్వాగతించే బాల్ డ్రాప్ కల్చర్ 1904 నుంచీ ఉంది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా
వాస్తవానికి న్యూ ఇయర్ అనే కాన్సెప్ట్ రోమ్‌లో తొలిసారిగా ప్రారంభమైంది. ఇక అమెరికాలో న్యూ ఇయర్‌ను స్వాగతించే బాల్ డ్రాప్ కల్చర్ 1904 నుంచీ ఉంది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా టైమ్ స్క్వేయర్‌లో జరుగుతుంది. తొలిసారి న్యూ ఇయర్ వేడుకలకు 2 లక్షల మంది హాజరయ్యారు. ఆ న్యూ ఇయర్ వేడుకలు పత్రికలో రావటం అదే ప్రథమం. ప్రతి ఏడాది కనీసం 50 టన్నుల చెత్త పోగవుతుందక్కడ.
బ్రెజిల్‌లో న్యూఇయర్ రోజును సముద్రతీరాల వద్ద గడుపుతారు. ఇదో ఆనవాయితీ.
డెన్మార్క్‌లో పింగాణీ ప్లేట్లను తమ బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద విసిరేస్తారు. దీని వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌ను జనవరి 1 తేదిన 80 శాతం ప్రజలు ప్రకటిస్తారు. దాదాపు అందరూ ఫిబ్రవరిలో ఆ విషయమే మర్చిపోతారు.
గ్రెగేరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టి జనవరి 1 వతేదీ ప్రాముఖ్యం చెప్పిన పోప్ జార్జి గీఐఐఐ కు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సంప్రదాయం మనకు 350 ఏళ్ల కితం ప్రారంభమైంది. అయితే టర్కీలో మాత్రం 1927 నుంచి ఈ క్యాలెండర్ అమల్లోకి వచ్చింది.
లాటిన్ భాష ప్రకారం జనవరి అంటే ‘న్యూ డోర్’ అనే అర్థం వస్తుంది.
న్యూఇయర్ రోజున కొత్త ఎర్రచెడ్డీ ధరిస్తే అదృష్టం కలిసొస్తుందని కొందరి ఇటాలియన్ల నమ్మకం.
బొలీవియాలో నాణేలు వేసి స్వీట్స్ తయారు చేస్తారు. జనవరి రోజున ఎవరికి కాయిన్స్ దొరికితే వాళ్లు అదృష్టవంతులుగా భావిస్తారు. ఫ్రెంచి వాళ్లు స్టాక్ పెట్టుకున్న ప్యాన్‌కేక్స్ తింటారు.
చైనీయులు మాత్రం వారి కొత్త సంవత్సరాన్ని క్యాలెండర్ ప్రకారం జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో జరుపుతారు.
Updated Date - 2022-12-31T23:05:37+05:30 IST