బల్లి, తొండ, మొసలి..
ABN, First Publish Date - 2022-07-20T06:37:18+05:30
బల్లి, తొండ, మొసలి.. జాతికి చెందినదే ఉడుము. ఎవరైనా గట్టిగా పట్టు పడితే ఉడుం పట్టు అంటాం.
బల్లి, తొండ, మొసలి.. జాతికి చెందినదే ఉడుము. ఎవరైనా గట్టిగా పట్టు పడితే ఉడుం పట్టు అంటాం. పూర్వకాలంలో రాజుల కోటలను ఉడుముల సాయంతో సైనికులు ఎక్కేవారు. మొత్తానికి ఉడుముల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఉడుము పొడవైన తోక, బలమైన కాళ్లతో శతృవును ఎదుర్కొంటుంది. 20సెం.మీటర్ల పొడవునుంచి 3 మీటర్ల వరకూ పొడవు ఉంటాయి. ఎక్కువగా నీళ్లు ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి.
ఉడములు ఆసియా ఖండంలో పుట్టిన జాతి. దాదాపు 65 మిలియన్ల సంవత్సరాల కితంనుంచి ఈ జాతి ఉంది.
ఇవి పొడవైన నాలుక సాయంతో ఆహారాన్ని సులువుగా పట్టేస్తుంది. అవి ఉండే ప్రాంతాన్ని బట్టి ఆకులు, నత్తలు, కీటకాలు, చేపలు, పక్షులు, పురుగులు, గుడ్లు తింటాయి.
ఆడ ఉడుము ఏడు నుంచి 37 గుడ్ల వరకూ పెడుతుంది. చెట్లపై కూడా ఉడుములు నివసిస్తాయి.
130 కేజీలుండే ఉడుములు కూడా ఉంటాయి. అవి మనుషులపై దాడి చేస్తాయి.
ఉడుములు సముద్రంలో కూడా ఈదగలవు. చాలా తెలివైనవి. తన గూటిలోని ఆరేడు గుడ్లను లెక్కపెట్టేంత తెలివితేటలు వాటి సొంతం.
Updated Date - 2022-07-20T06:37:18+05:30 IST