ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Subhashitam : విద్యాధనమే ప్రధానం

ABN, First Publish Date - 2022-12-01T23:43:25+05:30

న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాత్రుభాజ్యం న చ భారకారి వ్యయేకృతే వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాత్రుభాజ్యం న చ భారకారి

వ్యయేకృతే వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం

విద్య గొప్పతనాన్ని వివరిస్తూ భర్తృహరి చెప్పిన సుభాషితం ఇది.

ఈ శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి...

హర్తకు గాదు గోచర మహర్నిశమున్‌ సుఖపుష్టిసేయు స

త్కీర్తి ఘటింతు విద్య యను దివ్యధనం బఖిలార్థకోటికిం

బూర్తిగ నిచ్చినన్‌ బెరుగు బోదు యుగాంతపువేళనైన భూ

భర్తలు తద్ధనాథికుల పట్టున గర్వము మాను టొప్పగున్‌... అని తెలుగువారికి అందించారు.

‘‘విద్యను దొంగలెవరూ అపహరించలేరు. రాజులు స్వాధీనం చేసుకోలేరు. ‘విద్య’ అనే ఆస్తిని అన్నదమ్ములతో పంచుకోనక్కర్లేదు. అంతేకాదు, దాన్ని మోసుకుపోవడం భారం కూడా కాదు. అంటే ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. ఖర్చుపెట్టినా అది తరిగిపోదు. పైపెచ్చు దాన్ని ఇతరులకు పంచిన కొద్దీ పెరుగుతుంది. యుగాంతంలో కూడా నాశనం కాదు. అందుకే అన్ని ధనాల్లోనూ విద్యాధనమే ముఖ్యమైనది. అటువంటి ‘విద్య’ అనే ధనం కలిగిన వారి విషయంలో పాలకులు గర్వంతో వ్యవహరించకూడదు, ఆదరించాలి’’ అని భావం.

Updated Date - 2022-12-01T23:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising