ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీటీ రివ్యూ.. ‘మోనికా.. ఓ మై డార్లింగ్‌’

ABN, First Publish Date - 2022-11-19T23:07:18+05:30

ఓటీటీలు వచ్చాక కథలు బాగా విస్తరించాయి. ఎలాంటి కథైనా చెప్పొచ్చన్న ధీమా కలిగింది. కాకపోతే... ఆ కథలో ఆకర్షణీయమైన అంశాలుండాలంతే. స్టార్లు సైతం ఓటీటీల కోసం సినిమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటీనటులు : రాజ్‌కుమార్‌ రావు, హ్యూమా ఖురేషీ, రాధికా ఆప్టే, ఆకాంక్ష, భగవతి పెరుమూళ్‌, సుకాంత్‌ గోయల్‌ తదితరులు

సంగీతం : అంచిత్‌ థక్కర్‌

నిర్మాతలు : సరితా పాటిల్‌, సంజయ్‌,

విశాల్‌ బజాజ్‌

దర్శకత్వం : వానస్‌ బాలా

ఓటీటీ వేదిక : నెట్‌ ఫ్లిక్స్‌

నిడివి : 2 గంటల 26 నిమిషాలు

ఓటీటీలు వచ్చాక కథలు బాగా విస్తరించాయి. ఎలాంటి కథైనా చెప్పొచ్చన్న ధీమా కలిగింది. కాకపోతే... ఆ కథలో ఆకర్షణీయమైన అంశాలుండాలంతే. స్టార్లు సైతం ఓటీటీల కోసం సినిమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. బలమైన కంటెంట్‌ ఉంటే, ఎంత భారీ మొత్తమైనా పెట్టుబడిగా పెట్టేందుకు నిర్మాతలు, ఓటీటీ సంస్థలూ రెడీగానే ఉన్నాయి. హారర్‌, థ్రిల్లర్‌, కామెడీ జోనర్లకు ఓటీటీలో మంచి క్రేజ్‌. ముఖ్యంగా డార్క్‌ కామెడీలకు ఓటీటీలకు మించిన వేదిక ఉండదు. అందుకే... ఈ జోనర్‌లో ఎక్కువ సినిమాలు కనిపిస్తుంటాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మోనికా.. ఓ మై డార్లింగ్‌’ కూడా డార్క్‌ కామెడీ సినిమానే. రాజ్‌కుమార్‌ రావు, హ్యూమా ఖురేషీ, రాధికా ఆప్టే లాంటి పేరెన్నదగిన నటీనటులు ఈ సినిమాలో నటించారు. అందుకే... అందరి దృష్టీ ‘మోనికా..’పై పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? డార్క్‌ కామెడీలో నచ్చే అంశాలేంటి?

జై (రాజ్‌ కుమార్‌ రావు) చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన ఉద్యోగి. తన కంపెనీలో 4 శాతం వాటాతో పాటు, కీలకమైన పదవి దక్కుతుంది. తన బాస్‌ కూతురు నిక్కీ (ఆకాంక్ష)తో ప్రేమాయణం నడుపుతుంటాడు. ఇద్దరికీ పెళ్లయితే.. ఇక కంపెనీ మొత్తం జై దే. కాకపోతే.. అదే కంపెనీలో పనిచేసే మోనిక (హ్యూమా ఖురేషి)తో రహస్యంగా సహజీవనం చేస్తుంటాడు జై. మోనిక గర్భం దాలుస్తుంది. ఈ విషయాన్ని తనలో ఉంచుకోవాలంటే.. తన లైఫ్‌ని సెటిల్‌ చేయాలంటే... జైని బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది. అయితే... మోనిక బ్లాక్‌ మెయిల్‌ లిస్టులో జైతో పాటు మరో ఇద్దరు కూడా ఉంటారు. ఈ ముగ్గురూ కలిసి ఓ పథకం ప్రకారం మోనికని హతమార్చాలనుకొంటారు. అయితే ఈ ప్లాన్‌ వర్కవుట్‌ అయ్యిందా? ఈ ముగ్గురూ చేసిన చిన్న తప్పు వల్ల... ఎవరి జీవితాలు ఎలా మారిపోయాయి? అనేది అసలు కథ. ముందే చెప్పినట్టు ఇదో డార్క్‌ కామెడీ. ఈ జోనర్‌ స్పెషాలిటీ ఏమిటంటే.. ప్రతీ పాత్రలోనూ గ్రే షేడ్స్‌ కనిపిస్తుంటాయి. ఈ సినిమాలోనూ అంతే. దాదాపు ప్రతీ పాత్రలో రెండో కోణం ఉంటుంది. ఓ మర్డర్‌తో.. కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఆ తరవాత పాత్రల పరిచయం చక చకా సాగిపోతుంది. మోనిక బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో కథలో వేగం వస్తుంది. మర్డర్‌ ప్లాన్‌, ఆ వెంట వచ్చే సన్నివేశాలు ఇవన్నీ ఉత్కంఠత కలిగిస్తాయి. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఆ తరవాత.. జరిగే ఇన్వెస్టిగేషన్‌ లో ఏమాత్రం దమ్ములేదు. రాధిక ఆప్టే పాత్రని.. జోవియల్‌గా డిజైన్‌ చేయడం కొత్తగానే ఉంది కానీ, ఇన్వెస్టిగేషన్‌లో సీరియస్‌నెస్‌ పోయింది. ద్వితీయార్థం చాలా స్లోగా సాగుతూ.. విసుగు కలిగిస్తుంది. అయితే.. కీలకమైన ట్విస్టు మాత్రం బాగుంది. చివర్లో.. రెండు పాముల మధ్య కథానాయకుడ్ని ఫ్రీజ్‌ చేసి... పార్ట్‌ 2 ఉందన్నట్టు... సినిమాని ముగించారు.

పాత్రల ప్రవర్తనలో విచిత్రమైన కోణాలు, టేకింగ్‌, అక్కడక్కడ ఫన్నీ సీన్లు.. వీటితో కాలక్షేపం అయిపోతుంది. అయితే ఊపిరి బిగబెట్టి చూసే థ్రిల్లింగ్‌ సీన్లు ఏమీ ఉండవు. రాజ్‌కుమార్‌ రావు, హ్యూమా ఖురేషీ. రాధికా ఆప్టే.. ఇలా ప్రధానమైన పాత్రధారులంతా స్టార్లు, పేరు మోసిన వాళ్లు కావడంతో వారి వారి పాత్రల్లో సహజంగా ఇమిడిపోవడం వల్ల... ఈ సీన్లు రక్తి కట్టాయి. కొత్తవారెవరు చేసినా అవన్నీ తేలిపోయేవే. ఇలాంటి డార్క్‌ కామెడీ సినిమాలు ఇది వరకు చాలా చూసేయడం వల్ల... ‘మోనికా..’లో కొత్తగా ఏమీ లేదు. ఓల్డ్‌ సాంగ్‌ని థీమ్‌గా వాడుకోవడం వల్ల.. ఆనాటి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. సాంకేతికంగా.. రీ రికార్డింగ్‌, సౌండ్‌ డిజైనింగ్‌, కలర్‌ గ్రేడింగ్‌ ఇవన్నీ బాగా కుదిరాయి. దర్శకత్వ పరంగా మెరుపులేం లేవు. సరదాగా కాసేపు కాలక్షేపం కోసం అయితే ఓసారి చూసేయొచ్చు.

Updated Date - 2022-11-19T23:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising