ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

you should plan a second child: రెండో బిడ్డ కోసం ఫ్లాన్ చేస్తున్నారా..?

ABN, First Publish Date - 2022-11-16T13:11:53+05:30

ఆటలు, అల్లరి ఇవే కాకుండా చదువు విషయంలో కూడా ఇద్దరూ పోటీ పడతారు.

pregnancy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండో బిడ్డ ఎప్పుడు? ఇదే ప్రశ్న తరచుగా ఇరుగుపొరుగున ఉన్న ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు. ఇదే ప్రశ్న తల్లిదండ్రులు, అత్తమామల నుంచి కూడా ఎదురవుతూనే ఉంటుంది. మొదటి బిడ్డ పుట్టి వాళ్ళకు ఓ మూడేళ్ళ వయసు వచ్చిందంటే చాలు ఇక ఈ ఒత్తిడిని తీసుకువస్తూ ఉంటారు. మరొక బిడ్డ ఉండాలా వద్దా అని ఆలోచించుకునేందుకు సహాయపడే 5 బలమైన కారణాలు ఇవే.

గర్భం సమయంలో అసౌకర్యం

ఒకసారి గర్భవతిగా ఉన్నప్పుడు, గర్భం దాల్చినపుడు కలిగే అసౌకర్యాలన్నీ మొదటి గర్భంలో ఎదుర్కునే ఉంటారు. గర్భంలో తీసుకోవలసిన ఆహారం నుంచి, పడుకునే విధానం, అప్పుడప్పుడూ కలిగే అసౌకర్యాలు తెలిసే ఉంటుంది కనుక రెండో గర్భంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మొదటి గర్భధారణ సమయంలో గైనకాలజిస్ట్‌ సలహాలు రెండో గర్భంలో పాటించడానికి వీలవుతుంది. వైద్యపరంగా, రెండవ ప్రసవానికి కూడా ప్రసవ సమయం తక్కువగా ఉంటుంది.

పిల్లలు మరీ దగ్గరగా ఉంటారు.

కొన్నిసార్లు, పిల్లల సమస్యలను పరిష్కరించడానికి తల్లిదండ్రులు సరిపోరు. తోబుట్టువులకు మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు కూడా చాలా సంతోషంగా అనిపిస్తాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ, అనురాగం కలిగి ఉంటారు. అది ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది.

తరచుగా భయపడరు.

ఇద్దరు పిల్లలు ఉన్న ఇల్లు సందడిగా ఉంటుంది. ఆటలు, అల్లరి కలిసే చేస్తారు. పడుకునేప్పుడు కూడా కలిసే దగ్గరగా అతుక్కుపోయి పడుకుంటారు. ధైర్యంగా ఉంటారు. తల్లిదండ్రుల నిద్ర పాడు చేసే అవసరం ఉండదు. ఒకరికొకరు బలంగా ఉంటారు.

తోబుట్టువులు ఉంటే..

ఇద్దరు పిల్లలుంటే తోబుట్టువులు ఒకరికొకరు అతుక్కుపోతారు. ఎల్లప్పుడూ ఒకరికొకరు వెన్నుదన్నుగా ఉంటారు. మరొక బిడ్డ ఉండటం వల్ల ఇద్దరి మధ్యా సన్నిహితంగా అన్ని విషయాలు పంచుకునేలా పెరుగుతారు. ఒకరికి ఒకరు ధైర్యం అవుతారు. చదువులోనూ, ఆటల్లోనూ సపోర్ట్ గా నిలుస్తారు.

పోటీ తత్వం పెరుగుతుంది.

ఆటలు, అల్లరి ఇవే కాకుండా చదువు విషయంలో కూడా ఇద్దరూ పోటీ పడతారు. చక్కగా చదువుకునే వీలు సపోర్ట్ ఉంటుంది. ఒకరి సామర్థ్యాలు మరొకరికి తెలుస్తాయి. మనసులోని బాధను, సంతోషాన్ని కలిసిపంచుకునే వీలుంటుంది.

Updated Date - 2023-03-20T11:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising