మళ్లీ కలుస్తున్నారు!
ABN, First Publish Date - 2022-12-03T23:26:26+05:30
బాలీవుడ్‌లో పోలీస్ కథలు తీయడంలో స్పెషలిస్ట్‌గా దర్శకుడు రోహిత్ షెట్టికి పేరుంది. అజయ్ దేవగణ్ హీరోగా 2011లో తొలిసారిగా ‘సింగమ్’ చిత్రాన్ని ఆయన రూపొందించారు.
బాలీవుడ్‌లో పోలీస్ కథలు తీయడంలో స్పెషలిస్ట్‌గా దర్శకుడు రోహిత్ షెట్టికి పేరుంది. అజయ్ దేవగణ్ హీరోగా 2011లో తొలిసారిగా ‘సింగమ్’ చిత్రాన్ని ఆయన రూపొందించారు. అది హిట్ కావడంతో పోలీస్ కథలతోనే ‘సింగమ్ రిటర్న్స్’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ సినిమాలు తీశారు రోహిత్ షెట్టి. అయితే అజయ్ దేవగణ్, రోహిత్ కాంబినేషన్‌లో ‘సింగమ్’ చిత్రం పార్ట్ 3 వస్తే బాగుంటుందని చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వారికి ఇప్పుడు ఓ గుడ్ న్యూస్. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింగమ్ ఎగైన్’ చిత్రం తయారు కానుంది. ఈ విషయం అజయ్, రోహిత్‌లు చెప్పలేదు కానీ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అజయ్ ‘భోలా’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే ‘సింగమ్ ఎగైన్’ మొదలవుతుందని తరుణ్ ట్వీట్ చేశారు.
Updated Date - 2022-12-03T23:26:27+05:30 IST