ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Omicron BF7: వణికిస్తున్న ఒమైక్రాన్‌ బిఎఫ్‌ 7

ABN, First Publish Date - 2022-12-27T03:32:24+05:30

ఇప్పటివరకూ మనం తీసుకున్న వ్యాక్సిన్లు ఊహాన్‌లో మొదలైన ఒరిజినల్‌ స్ట్రెయిన్‌ సార్స్‌ కొవిడ్‌ 2 ఆధారంగా తయారైనవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ కేర్‌

ఇప్పటివరకూ మనం తీసుకున్న వ్యాక్సిన్లు ఊహాన్‌లో మొదలైన ఒరిజినల్‌ స్ట్రెయిన్‌ సార్స్‌ కొవిడ్‌ 2 ఆధారంగా తయారైనవి. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే, మన దేశం కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు, వ్యాక్సిన్లతో హైబ్రీడ్‌ ఇమ్యూనిటీని సాధించింది. అయినప్పటికీ తాజా బిఎఫ్‌ 7 వేరియెంట్‌ను ఈ వ్యాక్సిన్లు ఆశించినంత సమర్థంగా అడ్డుకోలేవు. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త వేరియెంట్‌ను అడ్డుకునే వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే ప్రక్రియ సాగుతోంది. ఆలోగా ముందు జాగ్రత్తగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో బూస్టర్‌ డోసులు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి హైదరాబాద్‌ ఆధారిత భారత్‌ బయోటెక్‌ సహా మోడర్నా, ఫైజర్‌ లాంటి ఇతర ప్రపంచ స్థాయి కంపెనీలు తాజా వేరియెంట్‌ను అడ్డుకునే వ్యాక్సిన్లను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి.

వ్యాక్సిన్లు అభివృద్ధి దశలోనే...

విదేశాల్లో ఎమ్‌ఆర్‌ఎన్‌ఎ ప్రక్రియ ఆధారంగా వ్యాక్సిన్లు తయారవుతుంటే, భారత్‌ బయోటెక్‌, పూర్తి వైరస్‌ ఆర్‌ఎన్‌ఎ ఆధారంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. కొన్ని నెలల క్రితం యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈమ్‌ఎ)కి చెందిన హ్యూమన్‌ మెడిసిన్‌ కమిటీ, ఒమైక్రాన్‌ సబ్‌ వేరియెంట్లు అయిన బిఎ4, బిఎ5లు లక్ష్యంగా తయారైన బైవలెంట్‌ (రెండు స్ట్రెయిన్లు) వ్యాక్సిన్లను సమర్ధించింది. కరోనా వైరస్‌ ఒమైక్రాన్‌ వేరియెంట్ల ఆధారంగా తయారయ్యే ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ బూస్టర్‌ వ్యాక్సిన్‌ గురించి చర్చిండంతో పాటు, అన్ని పరివర్తనాల వేరియెంట్ల లక్ష్యంగా వ్యాక్సిన్‌ తయారీ గురించి కూడా ఈ కమిటీ చర్చించడం విశేషం.

రక్షణ ఇలా...

భారత్‌ బయోటెక్‌ కొత్త వేరియెంట్‌ను అడ్డుకోగలిగే వ్యాక్సిన్‌ తయారీ ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉంది. రానున్న ఏడాదిలో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. అయితే అప్పటివరకూ బిఎఫ్‌7 నుంచి రక్షణ పొందాలంటే, మునుపటి కొవిడ్‌ నియమాలను పాటించక తప్పదు. మాస్క్‌ వాడుతూ, భౌతిక దూరం పాటిస్తూ, చేతులను తరచూ శుభ్రపరుచుకోవడంతో పాటు, జనసమ్మర్ధ ప్రదేశాలకు దూరంగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకూ ప్రయాణాలను పరిమితం చేసుకోవాలి.

Updated Date - 2022-12-27T11:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising