National Service Scheme Day: నిస్వార్థమే లక్ష్యంగా సమాజసేవ చేస్తున్న యువత.
ABN, First Publish Date - 2022-09-24T19:37:16+05:30
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో ఈ పథకం అమలవుతుంది. చదువుకుంటూనే సామాజిక సేవలో NSS ద్వారా భాగస్వాములు అవుతారు.
ఉన్నత చదువులు చదువుతున్న నేటి యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవా గుణం పెంపొందాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ జాతీయ సేవా పథకాన్ని NSS అని పిలుస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో ఈ పథకం అమలవుతుంది. చదువుకుంటూనే సామాజిక సేవలో NSS ద్వారా భాగస్వాములు అవుతారు.
ఈ ప్రజా సేవా పథకం భారతదేశంలో అధికారికంగా 1969 నుంచి సెప్టంబర్ 24ని NSS డే గా పాటిస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో ఈ రోజును జరుపుకుంటారు. 1958లో ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలో ప్రతిపాదిస్తూ... ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని విద్యా మంత్రిత్వ శాఖను కోరారు. అలా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వారి సిలబస్ తో పాటు సమాజ సేవలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని కూడా పెంచడానికి దీనిని ప్రారంభించారు.
జాతీయ సేవా పథకం 40,00 మంది వాలంటీర్లతో మొదలయింది. కానీ ఇప్పుడు 3.8 మిలియన్లకు పైగా ఇందులో వాలంటీర్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం NSS దినోత్సవాన్ని క్విజ్, డ్రామా, ప్రదర్శనలతో, ప్రసంగాలతో రకరకాల పోటీలను నిర్వహిస్తారు.
NSS డే: నినాదం
"నాట్ మీ బట్ యు" NSS తత్వశాస్త్రాన్ని చెపుతుంది. ప్రతి వ్యక్తి సంక్షేమం సమాజ శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి ప్రతి వాలంటీర్ సమాజ అభివృద్ధికి పాటుపడాలి.
వాలంటీర్లు చేసే సేవా కార్యక్రమాలు:
వైద్య శిబిరాలను నిర్వహించడం
బందోబస్తులు, ఊరేగింపులు
సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
NSSతో లాభాలు..
వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది.
బృందంతో కలిసి పని చేయగలిగే చొరవ వస్తుంది.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
న్యాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
అనేక రంగాలలో ప్రవేశించే నేర్పును సాధిస్తారు.
వ్యక్తిగత జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి కూడా NSS ఉపయోగపడుతుంది.
రూల్స్..
ప్రతి వాలంటీర్ తప్పనిసరిగా ఒక విద్యా సంవత్సరంలో 120 గంటల సామాజిక సేవను పూర్తి చేయాలి. సంఘంతో వారి సంబంధాలను అర్థం చేసుకోవడానికి, సమాజం అభివృద్ధి పట్ల బలమైన బాధ్యతను పెంపొందించడానికి, సమాజ సేవ ద్వారా ప్రతి వాలంటీర్ వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా చేసుకునే కార్యక్రమమే ఈ NSS.
NSS డే: స్ఫూర్తిదాయకమైన కోట్స్..
"స్వప్రయోజనం ప్రజా సేవను అధిగమించినప్పుడు, సమాజం అవినీతి భారంతో కుప్పకూలిపోతుంది." - కెన్ పోయిరోట్
"మీరు వంద మందికి ఆహారం ఇవ్వలేకపోతే, ఒకరికి మాత్రమే ఆహారం ఇవ్వండి." - మదర్ థెరిస్సా
“అందరూ గొప్పవారు కావచ్చు. ఎందుకంటే ఎవరైనా సేవ చేయవచ్చు. సేవ చేయడానికి కళాశాల డిగ్రీని అవసరం లేదు. సేవ చేయడానికి భౌతిక శాస్త్రంలో థర్మోడైనమిక్స్ , రెండవ సిద్ధాంతాన్ని తెలుసుకోవలసిన అవసరం లేదు. దయతో నిండిన హృదయం మాత్రమే అవసరం.”- మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్.
"దయ చిన్న చర్యే అయినా గొప్ప ఉద్దేశ్యం కంటే విలువైనది." - ఆస్కార్ వైల్డ్
యువతను చైతన్యవంతంగా మార్చే ప్రయత్నంలో NSS సహాయపడుతుంది. ప్రతి సామాజిక కార్యక్రమానికీ విద్యర్థలను చైతన్యవంతులుగా మారుస్తుంది. చాలా అంశాల్లో వీరు ప్రభావవంతులుగా తయారవుతారు.
Updated Date - 2022-09-24T19:37:16+05:30 IST