ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14ఏళ్ల బాలిక స్కూల్‌లో చేసిన పనికి ఉపాధ్యాయులు షాక్.. పోలీసులు రంగంలోకి దిగడంతో.. బయటపడ్డ అసలు నిజం!

ABN, First Publish Date - 2022-10-24T12:19:27+05:30

ఆ బాలికకు సుమారు 14ఏళ్ల వయసు ఉంటుంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటోంది. తాజాగా ఆమె ఓ షాకింగ్ పని చేసింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆ బాలికకు సుమారు 14ఏళ్ల వయసు ఉంటుంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటోంది. తాజాగా ఆమె ఓ షాకింగ్ పని చేసింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన 14ఏళ్ల బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లోరిడాలోని మేరియన్ కౌంటీలో నివసిస్తోంది. కొద్ది దూరంలో Lake Weir వద్ద మిడిల్ స్కూల్‌లో చదువుకుంటున్న ఈ బాలిక.. తాజాగా షాకింగ్ పని చేసింది. స్కూల్‌లో ఉన్న ఇతర విద్యార్థులకు పెద్ద మొత్తంలో డబ్బులు పంచింది. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది గుర్తించారు. అనంతరం ఆ బాలికను తనిఖీ చేయగా.. తన వద్ద సుమారు 2,500డాలర్లు లభ్యమయ్యాయి. దీంతో ఇంత డబ్బు ఎక్కడిదని ఉపాధ్యాయులు ఆ బాలికను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆ అమ్మాయి.. పాఠశాల పూర్వ విద్యార్థి ఒకరు తనకు డబ్బులు ఇచ్చి ఇతర విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించినట్టు చెప్పింది. దీంతో ఉపాధ్యాయులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆ అమ్మాయితో అసలు నిజం చెప్పించారు. తన బామ్మదాచుకున్న 13,500 డాలర్లను దొంగిలించి.. వాటిని తోటి విద్యార్థులకు పంచిపెట్టినట్టు తెలిపింది. కానీ డబ్బులు అలా ఎందుకు పంచిపెట్టావని ప్రశ్నిస్తే మాత్రం ఆమె వద్ద నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆ బాలికపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-10-24T12:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising