భారతీయులతో కలిసి అమెరికా వైస్ ప్రెసిడెంట్ దీపావళి వేడుకలు
ABN, First Publish Date - 2022-10-23T20:46:14+05:30
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శుక్రవారం నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారి నివాసంలో దసరా వేడుకలు జరుపుకున్నారు.
ఎన్నారై డెస్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శుక్రవారం నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారి నివాసంలో దసరా వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరినీ కమలా హ్యారిస్ దంపతులకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు. కమలా హ్యారిస్..అతిథులతో కలిసి బాణాసంచా కాల్చారు. దిపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటి తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి. ’’ అని కమలా హ్యారిస్ తెలిపారు. అమెరికాలో భారతీయ సంతతి వారి ప్రభావం, ప్రభావం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దిపావళి పండుగ..అమెరికాలో ఓ ముఖ్యవేడుకగా ప్రాముఖ్యం సంతరించుకుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్‌ల అధికారిక నివాసాల్లోనూ దీపావళి వేడుకలు జరిగాయి.
Updated Date - 2022-10-23T20:46:16+05:30 IST