ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anand Mahindra: దుబాయ్ హిందూ ఆలయాన్ని సందర్శించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2022-10-29T09:41:06+05:30

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దుబాయ్‌లోని జెబెల్ అలీ ప్రాంతంలో వర్షిప్ విలేజ్ ఏరియాలో నిర్మించిన హిందూ ఆలయాన్ని (Hindu Temple) సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దుబాయ్‌లోని జెబెల్ అలీ ప్రాంతంలో వర్షిప్ విలేజ్ ఏరియాలో నిర్మించిన హిందూ ఆలయాన్ని (Hindu Temple) సందర్శించారు. ఇటీవలే దసరా (Dasara) సందర్భంగా ఈ దేవాలయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆలయాన్ని సందర్శించిన ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ (Twitter) వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక దుబాయ్‌లోని భారత ప్రవాసులు (Indian Expats) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ దేవాలయం నిర్మాణానికి ఫిదా అయిన ఆయన ఈసారి దుబాయ్ (Dubai) వెళ్తే తప్పకుండా జెబెల్ అలీ ప్రాంతంలోని ఈ ఆలయానికి వెళ్తానంటూ గతంలో ట్వీట్ చేశారు. అన్నట్టుగానే తాజాగా ఆనంద్ మహీంద్రా హిందూ ఆలయాన్ని సందర్శించారు. "ఎట్టకేలకు దుబాయ్‌లోని అద్భుత హిందూ ఆలయాన్ని దర్శించుకున్నాను. దుబాయ్‌లోని జబెల్ అలీలో ఉన్న ఈ కొత్త దేవాలయం చాలా బాగా నిర్మించారు. ఇతర దేవతామూర్తులతో పాటు శిర్డీ సాయి బాబా మూర్తి కూడా ఉంది." అని మహీంద్రా ట్వీట్ చేశారు.

కాగా, ఈ భారీ ఆలయ నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. యూఏఈ సర్కార్ (UAE Govt) ఈ దేవాలయం నిర్మాణం కోసం 2019లో స్థలం కేటాయించింది. 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించారు. ముఖ్యంగా పర్యాటకులను (Visitors) ఆకట్టుకునేలా రూపుదిద్దారు. ఇక ఈ ఆలయంలో గురు గ్రంథ్ సాహిబ్‌తో పాటు శివుడు, కృష్ణుడు, గణేష్, మహాలక్ష్మితో సహా 16 మంది దేవతలను ప్రతిష్టించారు. ఆలయంలో విలక్షణమైన వాస్తుశిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. ఆలయం బయటి గోపురాలపై తొమ్మిది ఇత్తడి గోపురాలు, కలశాలు ఉన్నాయి. పై అంతస్తులోని ప్రార్థన మందిరంలో 105 ఇత్తడి గంటలు అమర్చారు. దుబాయ్‌లో ఉన్న హిందూ దేవాలయాల్లో ఇది రెండవది. మొదటి ఆలయాన్ని 1958లో నిర్మించారు. ఈ హిందూ దేవాలయంలోకి అన్ని మతాల ప్రజలు రావొచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ఆలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. సందర్శకులు, భక్తులు వారి పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, సందర్శకుల సంఖ్యను అందించిన తర్వాత అరగంటలో స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా నలుగురు సందర్శకులు అనుమతించడం జరుగుతుంది. ఉదయం 6 నుండి రాత్రి 8.30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అయితే, సందర్శకులు దేవాలయానికి వచ్చే సమయంలో సాంప్రదాయ దుస్తులను ధరించడం తప్పనిసరి.

Updated Date - 2022-10-29T09:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising