NRI: రోటరీ క్లబ్, తానా మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన
ABN, First Publish Date - 2022-11-14T18:42:39+05:30
రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్, మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.
ఎన్నారై డెస్క్: రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు(Rotary Club of Inkollu), ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా-TANA) సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్, మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఇంకొల్లు రోటరీగంగ సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం(Medical Camp) నిర్వహించారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్(Basavatarakam Indo American Cancer Hospital) వైద్య బృందం..రోగులకు వివిధ రకాలు పరీక్షలు నిర్వహించి, తగు సూచనలు సలహాలు అందించింది. ఈ సందర్భంగా మొత్తం 165 మందికి క్యాన్సర్ పరీక్షలు, 555 మందికి జనరల్ మెడిసిన్, కంటివైద్యం, నరాలు, ఊపిరితిత్తులు సంబంధిత టెస్టులు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన తానా కోశాధికారి కొల్లా అశోక్‌బాబు తానా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. మెడికల్ క్యాంప్ నిర్వాహకులకు తానా తరపున ధన్యవాదాలు తెలిపారు. కొల్లా సాకేత్ జ్ఞాపకార్థం నాగుబడి సుబ్బారావు.. శిబిరం నిర్వహణకు సహకరించారు. ఈ మెడికల్ క్యాంప్‌లో టాప్ స్టార్ హాస్పిటల్ విజయవాడ వైద్య బృందం డా. రంజిత్ కుమార్, షణ్ముఖ్, రామ్‌కుమార్, సాయిశంకర్, అజయ్‌కుమార్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డా. శ్రావణ్ కుమార్, రేణుక, రవి శంకర్, ప్రదీప్, సదాశివరెడ్డి, తాతినేని శ్రీనివాస్, రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్ అధ్యక్ష కార్యదర్శులు భవనం అంజిరెడ్డి, కరి కమలేశ్వరావు, తోటకూర విజయభాస్కర్, వంకాయపాటి శ్రీమన్నారాయణ, రామ్మోహన్ రావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-14T20:43:30+05:30 IST