NRI: ఎన్నారైలూ అలర్ట్.. ఐసీఐసీఐ బ్యాంక్ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2022-10-24T23:42:31+05:30

ఎన్నారై సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబంధించి సర్వీస్ చార్జీలు పెంచుతున్నట్టు ఐసీఐసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

NRI: ఎన్నారైలూ అలర్ట్.. ఐసీఐసీఐ బ్యాంక్ కీలక ప్రకటన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ(ICICI) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఎన్నారై సేవింగ్స్ అకౌంట్స్‌కు(NRI Savings Account) సంబంధించి సర్వీస్ చార్జీలు(Service Charges) పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 1 నుంచి సవరించిన చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా.. చెక్కు ద్వారా జరిగే లావాదేవీలకు సంబంధించిన పెనాల్టీను కూడా పెంచుతున్నట్టు చెప్పింది. క్యాష్ డిపాజిట్లు, బ్యాంక్ సేట్‌మెంట్, పాస్‌బుక్ సంబంధించి డూప్లికేట్ సర్టిఫికేట్‌ల జారీ, తదితర సేవలన్నిటికీ చార్జీలు పెంచుతున్నట్టు పేర్కొంది.

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకు రూ.7558 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 33 శాతం అధికం. ఇక బ్యాంకు నికర ఆదాయం 26 శాతం పెరగ్గా, ప్రాఫిట్ మార్జిన్ 4.31 శాతం మేర పెరిగింది. దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐకి ప్రస్తుతం 5,614 బ్రాంచ్‌లు ఉన్నాయి. మొత్తం 13,254 ఏటీఎంల నెట్వర్క్ కూడా ఉంది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా సందీప్ బక్షీని మరోసారి నియమించినట్టు బ్యాంకు సెబీకి ఇచ్చిన వివరాల్లో తెలిపింది.

ICICI2.jpeg

Updated Date - 2022-10-24T23:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising