ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: బ్రిటన్‌కు కొత్త ట్రెండ్ పరిచయం చేసిన భారతీయుడు.. ప్రజల నుంచి భారీగా స్పందన..

ABN, First Publish Date - 2022-12-11T19:28:05+05:30

బ్రిటన్‌కు కొత్త ట్రెండ్ పరిచయం చేసి భారతీయుడు. ప్రజల నుంచి భారీ రెస్పాన్స్. మా నగరానికి రావాలంటూ పోటెత్తిన ఆహ్వానాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వారందరూ పొద్దున్నే చేసే పని జాగింగ్. ఇలా జాగింగ్ చేసేటప్పుడు మనందరికీ రోడ్లపై చెత్త కనిపిస్తుంటుంది. కానీ చాలా మంది దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు. అయితే.. పూణేకు చెందిన వివేక్ గౌరవ్ (Vivek Gaurav) మాత్రం అలా కాదు..! తనకు కనిపించిన చెత్తను వెంటనే తీసి సమీపంలోని చెత్తబుట్టలో పడేస్తాడు. ఈ అలవాటు కారణంగా పూణేలో..ప్లాగింగ్ పేరిట ఓ కొత్త ట్రెండ్‌కు పురుడు పోసుకుంది. 2018లో వివేక్ ఏర్పాటు చేసిన ప్లాగింగ్(Plogging) కమ్యూనిటీలో ప్రస్తుతం 10 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఇక పైచదువుల కోసం బ్రిటన్‌ వెళ్లిన వివేక్ అక్కడి వారికీ ప్లాగింగ్ పరిచయం చేయడంతో అక్కడా ఈ ట్రేండ్ వెళ్లూనుకుంది.

వాస్తవానికి ఈ ప్లాగింగ్ తొలిసారిగా స్వీడన్‌లో వెలుగు చూసింది. పర్యావరణ పరిరక్షణ కోసం కొందరు తమ పని తాము చేసుకుంటూనే పరిసరాల శుభ్రత కోసం ఈ ట్రెండ్‌ను కనిపెట్టారు. దీని స్ఫూర్తితో వివేక్.. ప్లాగింగ్‌ను పూణే ప్రజలకు పరిచయం చేశాడు. ఇక గత సెప్టెంబర్‌లో అతడు బ్రిటన్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీలో చేరాడు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్(University of Bristol) కథనం ప్రకారం.. గౌరవ్ ఇప్పటివరకూ 420 మైళ్లు ప్లాగింగ్ చేశాడు. అతడు బ్రిస్టల్‌లో(Bristol) చేపట్టిన ప్లాగింగ్ కార్యక్రమాల్లో 180 దేశాలకు చెందిన వారు స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో.. గౌరవ్ తన ప్లాగింగ్ కార్యక్రమాన్ని మరో 30 యూకే నగరాలకు విస్తరించేందుకు నిర్ణయించాడు. ‘‘నేను ఎక్కువగా బ్రిస్టల్‌లోనే ప్లాగింగ్ చేశా. కానీ మాంచెస్టర్, లీడ్స్, డర్బీ నగరాల ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో సందర్శించాలని నన్ను కోరుతుంటారు. కాబట్టి.. ప్లాగింగ్‌ను 30 నగరాలకు విస్తరించాలని నిర్ణయించుకున్నా. బ్రిటన్ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలనేదే నా లక్ష్యం. ఒకసారి వారికి ప్లాగింగ్‌ను పరిచయం చేస్తే ఆ తరువాత స్థానికులు సంఘాలుగా ఏర్పడి ప్లాగింగ్‌ను ముందుకు తీసుకెళతారు’’ అని గౌరవ్ మీడియాకు తెలిపాడు.

పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ్ చేస్తున్న కృషిని బ్రిటన్ ప్రభుత్వం గుర్తించింది. అతడికి పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్‌ను బహూకరించింది. బ్రిస్టల్‌లో 250 ప్లాగింగ్ కార్యక్రమాలు నిర్వహించి వీధుల్లోని 3,750 కిలోగ్రాముల చెత్తను ఏరివేసినందుకు గౌరవ్‌ను ఈ అవార్డు వరించింది. ఈ మిషన్లలో మొత్తం 170 మంది వలంటీర్లు గౌరవ్ వెంట నడిచారు. ‘‘నాకు ఈ అవార్డు వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాను. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలన్న నా లక్ష్యానికి ఈ అవార్డుతో మరింత తోడ్పాటు లభించింది’’ అని గౌరవ్ వ్యాఖ్యానించాడు.

Updated Date - 2022-12-11T19:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising