ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఉక్రెయిన్ వీడిన భారతీయులు రష్యాలో చదువుకోవచ్చు

ABN, First Publish Date - 2022-11-11T21:24:05+05:30

ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఉద్దేశించి రష్యా తొలిసారిగా కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్‌లో(Ukraine) చదువుకుంటున్న భారత విద్యార్థులను ఉద్దేశించి రష్యా(Russia) తొలిసారిగా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ వీడిన భారత విద్యార్థులు రష్యాలో తమ చదువు కొనసాగించవచ్చని గురువారం నాడు ప్రకటించింది. ‘‘ఉక్రెయిన్ వీడిన భారత మెడికల్ విద్యార్థులు(Indian medical students) రష్యాలో తమ చదువు కొనసాగించవచ్చు. రెండు దేశాల సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. ఉక్రెయిన్‌లో చాలా మంది రష్యా భాష మాట్లాడుతారు కాబట్టి.. భాషా సమస్య కూడా ఉండదు. రష్యాలో వారందరికీ సాదర స్వాగతం’’ అంటూ చెన్నైలోని రష్యా రాయబారి(Russian diplomat) ఓలెగ్ ఆవడీవ్ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడితో (Ukraine-Russia war) అక్కడి భారతీయ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన అనేక మందిని స్వదేశానికి తరలించింది. కాగా.. భారత్‌కు రష్యా చమురు ఎగుమతులపై కూడా రష్యా రాయబారి స్పందించారు. ‘‘ఈ ఏడాదిలో ఇప్పటివరకూ రష్యా చమురు ఎగుమతులు 22 శాతం పెరిగాయి. ఇది చాలా ఎక్కువ. ఇరాక్, సౌదీ అరేబియాను వెనక్కు నెట్టి రష్యా అతి పెద్ద చమురు ఉత్పత్తిదారుగా అవతరించింది’’ అని ఒలెగ్ అన్నారు.

రష్యా నుంచి చమురు దిగుమతులపై కేంద్ర మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన ఒలెగ్..భారత్ వైఖరిపై ప్రశంసలు కురిపించారు. ‘‘భారత ప్రభుత్వం బాధ్యతాయుతమైనది. దేశ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది’’ అని మంత్రి జైశంకర్ గతంలో వ్యాఖ్యానించారు. కాగా.. మంగళవారం కూడా జైశంకర్ నాటి వ్యాఖ్యలను పునరుద్ఝాటించారు. ‘‘రష్యాతో బంధం భారత్‌కు ప్రయోజనం చేకూర్చింది. దీన్ని కేంద్రం కొనసాగించాలనుకుంటోంది.’’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా..పైచదువుల కోసం రష్యాకు వస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయాన్ని కూడా రష్యా రాయబారి ప్రస్తావించారు. అనేక మంది రష్యా స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. మెడిసిన్‌తో పాటూ ఇతర కోర్సులు చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు అనేక మంది ఉక్రెయిన్‌తో పాటూ రష్యాకు కూడా వెళుతుంటారు.

Updated Date - 2022-11-12T00:12:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising