ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: బ్రిటన్‌లో భారతీయుల సరికొత్త రికార్డు..

ABN, First Publish Date - 2022-11-25T21:33:49+05:30

బ్రిటన్‌లో భారతీయులు తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో(UK) భారతీయులు తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. చైనా వారిని(Chinese) వెనక్కునెట్టి మరీ ఇండియన్స్(Indians) అత్యధికంగా బ్రిటన్ స్టూడెంట్ వీసాలు(Student Visas) పొందిన విదేశీయులుగా(Foreign Students) రికార్డు నెలకొల్పారు. ఇటీవల కొన్నేళ్లుగా బ్రిటన్ వీసాలు పొందుతున్న భారత విద్యార్థుల సంఖ్య ఏకంగా 273 శాతం పెరిగిందని తాజాగా విడుదలైన బ్రిటన్ హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమాచారం ప్రకారం.. వృత్తి నిపుణులకు ఇచ్చే వర్క్ వీసాలు(Work Visas) పొందుతున్న విదేశీయుల్లో భారతీయులే ముందున్నారు. గతేడాది భారతీయులకు 56,042 వర్క్ వీసాలు జారీ అయ్యాయి. విదేశీ వైద్య వృత్తినిపుణులకు ఇచ్చే స్కిల్డ్ వర్క్ హెల్త్ అండ్ కేర్ వీసాల్లో ఏకంగా 36 శాతం భారతీయులే దక్కించుకున్నారు. దీంతో.. అమెరికా ప్రజావైద్య రంగంలో భారతీయుల కీలక పాత్ర పోషిస్తున్నట్టు మరింతగా తేటతెల్లమైంది.

స్పాన్సర్డ్ స్టడీ వీసాలు(Sponsored Study Visas) దక్కించుకున్న విదేశస్తుల్లో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారని బ్రిటన్ హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. విదేశీ విద్యార్థులు బ్రిటన్‌లో చదువు పూర్తి చేసుకున్నాక ఉపాధి పొందేందుకు అనుమతించేలా బ్రిటన్ ప్రభుత్వం గతేడాది ‘గ్రాడ్యూయేట్ రూట్ వీసా’(Graduate Route Visa) పేరిట ఓ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ వీసా కేటగిరీలోనూ భారతీయులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. మొత్తం వీసాల్లో 41 శాతం భారతీయ విద్యార్థులే దక్కించుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ యూనివర్శిటీల్లోని విద్యార్థులను బ్రిటన్ వైపు ఆకర్షించేందుకు ఉద్దేశించిన హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసా కేటగిరీలోనూ భారత విద్యార్థులు తమ ఉనికిని చాటుకున్నారు. మొత్తం వీసాల్లో 14 శాతం భారతీయులే దక్కించుకున్నారు. ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో భారత యూనివర్సిటీలకు చోటు దక్కకపోయినా..వీటిల్లో చదివిన వారు మాత్రం హైపొటెన్షియల్ వీసాలను కొల్లగొట్టడం గమనార్హం.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2019తో పోలిస్తే ప్రస్తుతం బ్రిటన్ వీసాలు పొందిన ఇండియా, నైజీరియా, పాకిస్థాన్, బాంగ్లాదేశీ విద్యార్థుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. జూన్ 2021తో ముగిసిన ఏడాది కాలంలో బ్రిటన్‌లోకి వలసొచ్చిన వారి సంఖ్య 1,73,000 కాగా.. జూన్ 2022 నాటికి ఈ సంఖ్య ఏకంగా 5,04,000కు చేరింది. లాక్‌డౌన్ ఆంక్షలు ముగియడం, బ్రెక్జిట్ తరువాత పూర్తికాలానికి గణాంకాలు అందుబాటులో ఉండటం, హాంగ్‌కాంగ్ బ్రిటీష్ నేషనల్స్ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన వీసా విధానం కారణంగా..బ్రిటన్‌లో దీర్ఘకాలిక వలసల సంఖ్య బాగా పెరిగినట్టు తెలుస్తోంది.

Updated Date - 2022-11-25T21:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising