ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Diwali 2022: ఫలించిన పోరాటం.. నేరవేరిన న్యూయార్క్‌లోని ఇండో-అమెరికన్ల 2దశాబ్దాల డిమాండ్

ABN, First Publish Date - 2022-10-21T17:08:02+05:30

అగ్రరాజ్యంలో అమెరికాలో భారత ప్రవాసులు భారీ సంఖ్యలో ఉన్న విషయం విదితమే. ఇతర దేశాల వారితో పోలిస్తే యూఎస్‌లో మనోళ్ల సంఖ్య చాలా ఎక్కువ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2023 నుంచి న్యూయార్క్‌ పబ్లిక్ స్కూళ్లలో దీపావళికి సెలవులు

న్యూయార్క్: అగ్రరాజ్యంలో అమెరికాలో భారత ప్రవాసులు భారీ సంఖ్యలో ఉన్న విషయం విదితమే. ఇతర దేశాల వారితో పోలిస్తే యూఎస్‌లో మనోళ్ల సంఖ్య చాలా ఎక్కువ. ఆ దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారతీయులు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క న్యూయార్క్‌లోనే మనోళ్లు ఏకంగా 2లక్షల మంది వరకు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.. అక్కడ భారతీయుల సంఖ్య ఎంత భారీగా ఉందో. ఇక తాజాగా న్యూయార్క్‌లో మనోళ్లు మరో ఘనత సాధించారు. గత రెండు దశాబ్దాలుగా అక్కడ ఉండే భారతీయ అమెరికన్లు ఓ డిమాండ్ కోసం గట్టిగా పోరాడుతున్నారు. మనం ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు పబ్లిక్ స్కూళ్లలో హాలీడేస్ ప్రకటించాలనేదే మనోళ్ల ఆ డిమాండ్. ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది. వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ వ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ స్కూళ్లకు దీపావళికి సెలవులు ఉంటాయని మేయర్ ఎరిక్ ఆడమ్స్ గురువారం ప్రకటించారు. 


ఈ నేపథ్యంలో న్యూయార్క్ అసెంబ్లీ మెంబర్ జెన్నీఫర్ ప్రిన్స్, న్యూయార్క్ సిటీ స్కూల్ చాన్స్‌లర్ డేవిడ్ బ్యాంక్స్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన మేయర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా రోజులుగా ఈ విషయంలో నిర్ణయం అనేది పెండింగ్‌లో ఉండింది. న్యూయార్క్ నగరంలో దాదాపు రెండు లక్షల వరకు భారతీయులు ఉన్నారు. అంత పెద్ద ప్రవాస సమూహం ఉన్న ఇక్కడ వారు జరుపుకునే దీపాల పండుగ దీవాళి ప్రత్యేకతను ఇక్కడి స్థానికులు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని' మేయర్ ఎరిక్ ఆడమ్స్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్‌లోని అన్ని పబ్లిక్ స్కూళ్లకు దీపావళికి ప్రత్యేకంగా సెలవులు ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. 


మేయర్ నిర్ణయం పట్ల న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రాంధీర్ జైశ్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసిన జైశ్వాల్.. ఇది భారతీయ అమెరికన్ కమ్యూనిటీ యొక్క చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అని పేర్కొన్నారు. ఈ గౌరవం న్యూయార్క్ నగరంలో వైవిధ్యం, బహుత్వానికి సూచీక అని తెలిపారు. అదే సమయంలో అన్ని వర్గాల ప్రజలు భారతీయ పండుగ విశిష్టతను తెలుసుకుని జరుపుకోవడానికి, ఆనందించడానికి తోడ్పడుతుందని చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-10-21T17:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising