ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: బహ్రెయిన్‌లో వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-11-04T21:39:14+05:30

బహ్రెయిన్‌లో వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ద్వారా ప్రజాహిత రాజకీయాలకు నిర్వచనం ఇచ్చిన ఎన్టీఆర్

విదేశాలలో యువత ఉపాధికి చంద్రబాబు విజన్ కారణం

బహ్రెయిన్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో నేతలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: రాజకీయ నాయకుల చుట్టు ప్రజలు తిరిగే పరిస్థితిని ప్రజల చుట్టు రాజకీయ నాయకులు తిరిగే విధంగా ప్రియతమ నాయకుడు, దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పడం ద్వారా కల్పించారని తెలుగుదేశం నాయకులు టీ.డీ.జనార్ధన్ గుర్తు చేసారు. తెలుగుదేశం పార్టీ మనుగడకు ముందు ప్రజలు రాజకీయ నాయకుల కొరకు తిరిగే వారని, దాన్ని తెలుగుదేశం మార్చిందని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం బహ్రెయిన్‌లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సాముహిక వనభోజనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కరణం, మునసబు వ్యవస్థ రద్దు, రెండు రూపాయాలకు కిలో బియ్యం పథకం, మండల వ్యవస్థ ఏర్పాటు మొదలగు సాహోసోపేత నిర్ణయాల ద్వారా ప్రజా సంక్షేమానికి ఒక నూతన నిర్వచనం ఇచ్చారని జనార్ధన్ అన్నారు. అలాంటి గతం నుండి నేటి జగన్ సర్కారు చేస్తున్న ఆటవీక పాలన చూస్తే గుండె తర్కుకోపోతుందని ఆయన అన్నారు.

ఐటి వలన ఈ రోజు తెలుగు యువత గల్ఫ్‌తో సహా ప్రపంచంలోని ప్రతిచోట వెళ్ళి ఉద్యోగాలు చేస్తుందంటే దానికి చంద్రబాబు నాయుడు ముందు చూపు కారణమన్నది మరిచిపోవద్దని కూడా జనార్ధన్ హితవు పలికారు. మోత్తం అసియా ఖండంలో హైదరాబాద్‌ను ఐటి హబ్‌గా మార్చాడం ద్వారా ఈ రోజు తెలుగు యువత సాఫ్ట్‌వేర్‌‌కు ప్రతీకగా మారిందని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు విజన్ కారణానా ఉమ్మడి రాష్ట్రానికి ఒక ఇమేజి ఏర్పడి విదేశీ పెట్టుబడులు, విదేశాలలో యువతకు ఉపాధికి మార్గం సుగమమైందని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా అన్నారు. విదేశాలలో ఆయా రంగాలలో ప్రావీణ్యత కల్గిన ప్రవాసీయులను ఎన్టీఆర్ ఆహ్వానించి రాష్ట్ర పురోగతికి కృషి చేసారని ఆయన వివరించారు.

బహ్రెయిన్‌లోని ప్రముఖ ప్రవాసీ సామాజిక కార్యకర్త డొర్నాల శివకుమార్, కరుడుగట్టిన కాంగ్రేస్ వాది అయిన తాను తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అభిమానిగా మారారనేది వివరించగా సభికులు ఆసక్తిగా విన్నారు. తెలుగుదేశం పార్టీ బహ్రెయిన్ విభాగం అధ్యక్షుడు రఘునాథ్ బాబు ప్రవాసీయులు ఏ విధంగా రానున్న ఎన్నికలలో తమ నిర్ణయాత్మక పాత్రను తమ కుటుంబ, బంధుమిత్రుల ద్వారా నిర్వహించాలో వివరించగా తెలుగుదేశం జీ.సీ.సీ సభ్యుడు హరిబాబు బహ్రెయిన్‌లోని ప్రవాసీయుల పాత్రపై మాట్లాడారు.

పూర్తిగా కుటుంబీకుల ఆత్మీయ సమ్మేళనం తరహాలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులతో సహా ప్రతి ఒక్కరు స్వచ్ఛంధంగా పచ్చ కండువాలు కప్పుకుని పాల్గోన్నారు. ఎన్నికలకు ఒక నెల ముందు తామందరం మాతృభూమికి వెళ్ళి టీడీపీ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసారు. అంతకు ముందు జనార్ధన్, రాధాకృష్ణా అధ్వర్యంలో టీడీపీ నేతలు లేబర్ క్యాంపులను సందర్శించగా ప్రవాసీయులు వారికి ఉత్సహాంగా స్వాగతం పలికారు. తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఓట్లను సైకిల్ గుర్తుకు వేయిస్తామంటూ చెబుతూ ముందుకు వచ్చారు.

Updated Date - 2022-11-04T21:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising