RRR Collections: జపాన్‌లో కుంభస్థలాన్నే కొట్టేసేలా ఉంది.. ఇప్పటికే పలు రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి!
ABN, First Publish Date - 2022-11-18T09:01:46+05:30
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ టాప్ స్టార్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ RRR(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రంతో జక్కన్న మరోసారి సినీ లవర్స్‌ను మెస్మరైజ్ చేశాడు.
ఓవర్సీస్ సినిమా: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ టాప్ స్టార్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ RRR(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రంతో జక్కన్న మరోసారి సినీ లవర్స్‌ను మెస్మరైజ్ చేశాడు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఆ తర్వాత ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి చేరువైంది. హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ దర్శకనిర్మాతలు సైతం 'ఆర్ఆర్ఆర్'ను మెచ్చుకున్నారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ అయితే అందుకుంటుంది. ఇదిలాఉంటే.. RRR మూవీ అక్టోబర్ 21న జపాన్‌లో రిలీజైన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. జపాన్ దేశవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ 44 నగరాల్లో 209 స్క్రీన్స్, 31 ఐమాక్స్ కేంద్రాల్లో విడుదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ అక్కడ అరుదైన రికార్డును నమోదు చేసింది. నాలుగు వారాల్లోనే 250 మిలియన్ల జపాన్ యెన్లు(రూ.14.57కోట్లు) వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇక 'బాహుబలి-2' ఈ ఫిగర్‌ను చేరుకోవడానికి 36 వారాలు తీసుకుంటే.. 'ఆర్ఆర్ఆర్' మాత్రం ఊహించని విధంగా నాలుగు వారాల్లోనే వేగంగా క్రాస్ చేసి టాప్‌లో నిలిచింది. ఇప్పటికే అక్కడ 3 ఇడియట్స్ లైఫ్ టైమ్ కలెక్షన్లు 170 మిలియన్ల రికార్డును తుడిచిపెట్టేసింది. ఫలితంగా జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ సినిమాగా నిలిచింది. 24 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం ఆ దేశంలో 400 మిలియన్ల జపాన్ యెన్లు వసూలు చేసి ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత 'బాహుబలి-2' 300 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా... తాజాగా 250 మిలియన్లతో RRR మూడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో జక్కన్న తెరకెక్కించిన రెండు సినమాలు ఉండడం గమనార్హం. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో కనిపించాడు. అలాగే ఈ ఎపిక్ డ్రామాలో బాలీవుడ్ యాక్టర్స్ అలియాభట్, అజయ్ దేవ్‌గన్‌తో పాటు శ్రియా, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
Updated Date - 2022-11-18T13:14:27+05:30 IST