US: న్యూజెర్సీలో 'సీతారామం' చిత్ర బృందం సందడి
ABN, First Publish Date - 2022-11-03T11:51:15+05:30
ఇటీవల విడుదలై తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'సీతారామం' (Sita Ramam). తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది.
న్యూజెర్సీ: ఇటీవల విడుదలై తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'సీతారామం' (Sita Ramam). తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది. ఉమానియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీట్ ఆండ్ గ్రీట్'లో ఆ చిత్ర బృందం పాల్గొనడంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత స్వప్నదత్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవటం సంతోషంగా ఉందని, ఇంత అద్భుత ఆవకాశం కల్పించిన ఉమానియా టీంకి ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యాంకర్ ఉదయభాను ఎంతో ఆహ్లాదంగా నిర్వహించారు.
600లకుపైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైల మధ్య చిత్రయూనిట్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో UBlood app గురించి యాప్ ఫౌండర్ జై యలమంచిలి సవివరంగా తెలియజేసారు. రక్తదానం గురించి అలాగే రక్త గ్రహీతల పూర్తి సమాచారం కలిగిన యాప్ కావడంతో ఇలాంటి యాప్‌ని సృష్టించిన జై యలమంచిలిపై హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుతమైన ఈవెంట్‌లో యువత కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి యాంకర్ ఉదయభాను ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చారు. హీరో దుల్కర్ సల్మాన్‌కు, హీరోయిన్ మృణాళ్ ఠాకూర్‌కు లవ్ లెటర్ రాసి ఇంప్రెస్ చేయడమే ఆ టాస్క్. యూత్‌కు ఇలా టాస్క్ ఇవ్వడం ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెప్పుకొవచ్చు. ఇక చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అందరినీ అలరించాయి. ఈ సినిమాలోని ఒక పాటను పాడిన చిన్నారి ఈషాన్విని డైరెక్టర్ హను రాఘవపూడి అభినందించారు.
కన్నుల పండవగా జరిగిన కార్యక్రమానికి U-BLOOD, JAI SWARAJYA, JSW TV, బాలజీ ప్లవర్స్, కోరల్ బీడ్స్ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఈ 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం ఇంత భారీగా జరగడానికి సహకరించిన గ్రాండ్ స్పాన్సర్స్, మిగతా స్పాన్సర్లకు, ప్రేక్షకులకి అందరికి ఉమానియా టీమ్ అందరి తరుపున లక్ష్మీ దేవినేని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Updated Date - 2022-11-03T13:20:06+05:30 IST