RRR: అమెరికాలో అరుదైన ఫీట్.. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని విధంగా..!
ABN, First Publish Date - 2022-03-16T19:01:24+05:30
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'.
ఓవర్సీస్ సినిమా: యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ఈ నెల 25న వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, సింగిల్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలైన చెర్రీ, తారక్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటూండడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. అటు ఓవర్సీస్‌లో కూడా 'ఆర్ఆర్ఆర్'ను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ మూవీ ఇంతకుముందు ఏ భారతీయ చిత్రం విడుదల కాని విధంగా అత్యధిక లొకేషన్స్‌లో ప్రదర్శితం కానుంది.
విడుదలకు ఒకరోజు ముందుగానే అంటే మార్చి 24న యూఎస్‌లో ప్రీమియర్స్ పడనున్నాయి. దీనికోసం అక్కడ సినిమాను విడుదల చేస్తున్న సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ భారీ ఏర్పాట్లు చేశాయి. అమెరికాలో మొత్తం 1150కు పైగా లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తాజాగా ట్విటర్ ద్వారా ప్రకటించాయి. దాంతో అగ్రరాజ్యంలో ప్రీమియర్స్ ద్వారా భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కూడా యూఎస్‌లో ఇన్ని లొకేషన్స్‌లో విడుదల కాలేదు. దీంతో 'ఆర్ఆర్ఆర్' ఈ అరుదైన ఫీట్‌ను అందుకోనుంది. అలాగే ఈ చిత్రం ప్రీమియర్ షో ప్రపంచంలోనే అతి పెద్ద తెరైన యూకేలోని ఐమాక్స్ స్ర్కీన్‌పై ప్రదర్శించడం కూడా ఒక రికార్డే. అందులోనూ ‘డాల్బీ సినిమా’ ఫార్మేట్‌లో ప్రదర్శించబడుతుండడం మరో విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో భారీ అంచనాలతో వస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. విడుదల తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Updated Date - 2022-03-16T19:01:24+05:30 IST