ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: గుడివాడలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం - ఉచిత మెగా మెడికల్ క్యాంప్

ABN, First Publish Date - 2022-12-20T20:52:23+05:30

గుడివాడలో తాజాగా తానా చైతన్య స్రవంతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడలో తాజాగా తానా(TANA) చైతన్య స్రవంతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్(Medical Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, గౌరవ అతిథులుగా రావి వెంకటేశ్వర రావు, వర్ల కుమార్ రాజ, రోటరీ క్లబ్ గుడివాడ వారు పాల్గొన్నారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమానికి అమెరికా నుంచి వచ్చిన తానా నాయకులు సతీష్ వేమూరి, పురుషోత్తం గూడె, సునీల్ పాంత్రా, శశాంక్ యార్లగడ్డ, ఉమా కటికి, జోగేశ్వర రావు పెద్దిబోయిన, టాగోర్ మలినేని, రాజ కాసుకుర్తి, డా. రావు మొవ్వా, శ్రీనివాస ఓరుగంటి, నాగ పంచుమర్తి, రఘు ఎద్దులపల్లి, తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి, TNI Live ఎడిటర్ ముద్దు కృష్ణ నాయుడులను శశికాంత్ వల్లేపల్లి వేదిక మీదకు పిలిచి సత్కరించారు. తానా చేయూత ద్వారా 55 మంది స్కూల్ విద్యార్ధినులకు స్కాలర్‌షిప్‌లు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్‌లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ బహూకరించారు. Eye camp, ENT camp, Cancer camp నిర్వహించారు.

శశికాంత్ వల్లేపల్లి, వారి తండ్రి వల్లేపల్లి సీతా రామ్మోహన్ రావు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ - రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్, గుడివాడ వారికి 8,50,000 రూపాయల వ్యయంతో వైకుంఠ రథం బహూకరించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘అమెరికాలో ఎవరి పనులు వారు చేసుకొంటూ, ఉద్యోగాలలో ఎదుగుతూ ఇంత పెద్ద స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ఇక్కడ వున్న మనం కూడా మన వంతు సపోర్ట్ ఇవ్వాలి’’ అని సూచించారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా చేస్తున్న అనేక సహాయ కార్యక్రమాలను వివరించారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 4 వరకు జరిగే తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో జరిగే సేవా కార్యక్రమాలు వివరించారు. తానా ఫౌండేషన్ చైర్మన్ వేంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ ద్వారా ప్రతి సేవా కార్యక్రమానికి టార్గెట్స్ పెట్టుకొని వాటిని అధికమిస్తున్నామని చెప్పారు. 1000 మందికి స్కాలర్షిప్‌లు ఇద్దామని అనుకొని ఇప్పటికే 1000 మంది ఇచ్చామని చెప్పారు. అలాగే.. 50 క్యాన్సర్ క్యాంప్‌లు చేద్దామని టార్గెట్ పెట్టుకొని ఇప్పటికే 48 క్యాంప్‌లు నిర్వహించామని తెలిపారు. ఈ విధంగా ప్రతి సేవా కార్యక్రమానికి ఒక నంబర్ టార్గెట్ పెట్టుకొని చేస్తున్నామని, ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటానికి చేయూతను అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలపాలని అన్నారు. తానా సెక్రెటరీ సతీష్ వేమూరి మాట్లాడుతూ తానా టీమ్ స్క్వేర్ ద్వారా అమెరికాలో ఆపద, విపత్కర సమయాలలో ఏ విధంగా సహాయం చేస్తున్నామో వివరించారు.

Updated Date - 2022-12-20T20:58:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising