TANA: తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఏలూరులో ఉచిత మెగా మెడికల్ క్యాంప్
ABN, First Publish Date - 2022-12-11T21:39:31+05:30
తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఏలూరులోని తడికలపూడి హర్షిత రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీ ఆవరణలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
తానా(TANA) చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో గత 46 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తానా ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి అన్నారు. ఏలూరు(Eluru) జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీ ఆవరణలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు(Medical Camp) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తానా ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ, కొర్రపాటి గ్రూప్ సంస్థల చైర్మన్ రామారావు, డాక్టర్ కొర్రపాటి సుధాకర్, స్కూల్ ప్రిన్సిపల్ నందిగం రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిమంది స్థానికులకు మెడికల్ క్యాంపు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి మాట్లాడుతూ... పుట్టిన దేశం రుణం తీర్చుకునే విధంగా తానా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రైతులకు పవర్ స్ప్రేలు, ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం లాప్‌టాప్‌లు , అదేవిధంగా దయచేసి వివరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు, తానా చేయూత, తానా ఆదరణ ఇలా ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆయన తెలిపారు.
Updated Date - 2022-12-11T21:45:32+05:30 IST