NRI: అమెరికాలో 'టచ్ ఏ లైఫ్' ఆధ్వర్యంలో నవంబరు 19న వరల్డ్ కైండ్‌నెస్ డే
ABN, First Publish Date - 2022-11-04T19:33:53+05:30
‘టచ్ ఏ లైఫ్’.. ఈ ఏడాది నవంబరు 19న కాలిఫోర్నియాలోని శాంతక్లారా కన్వెన్షన్ సెంటర్లో వరల్డ్ కైండ్ నెస్ డే నిర్వహించనుంది.
మనకు తోచిన సాయంతో, మనసులో కాస్త కరుణతో… సమాజంలో అసాధారణమైన మార్పు తీసుకురావచ్చు అనే నమ్మకంతో ఏర్పడింది 'టచ్ ఏ లైఫ్'. దాతలకూ కష్టంలో ఉన్నవారికీ మధ్య వారధిగా నిలిచే టాల్ గివింగ్ యాప్‌తో 'టచ్ ఏ లైఫ్' మొదలైంది. విద్యార్థులను సోషల్ ఆంత్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దే టాల్ స్కౌట్స్, అనుభవజ్ఞులు తమ పరిజ్ఞానాన్ని పంచుకునే టాల్ లీడర్స్, నిరంతరం స్ఫూర్తిదాయకమైన కథనాలు అందించే ‘టాల్ రేడియో’, యువతకు భరోసా కల్పించే ‘టాల్ కెరీర్ హెల్ప్’… లాంటి విభాగాలెన్నో ‘టాల్ ఫౌండేషన్’లో భాగంగా ఉన్నాయి. వీటితో పాటుగా, ఏటా ‘వరల్డ్ కైండ్ నెస్ డే’ ను ఘనంగా నిర్వహిస్తోంది టచ్ ఏ లైఫ్. ఈ ఏడాది నవంబరు 19న కాలిఫోర్నియాలోని శాంతక్లారా కన్వెన్షన్ సెంటర్లో వరల్డ్ కైండ్ నెస్ డే నిర్వహిస్తోంది 'టచ్ ఏ లైఫ్'. ఆ రోజు సామాజిక సమస్యల మీద అనుభవజ్ఞులతో చర్చా కార్యక్రమాలు, ప్రతిభావంతుల ఉపన్యాసాలు, సంగీత ప్రదర్శనలు, వివిధ సంస్థల స్టాల్స్, విద్యార్థుల బూట్ క్యాంప్ ఈ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేశారు. వీటితో పాటు సమాజం కోసం పాటుపడుతున్న అరుదైన వ్యక్తిత్వాలను గుర్తించి గౌరవించే టాల్ హీరో పురస్కారాలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఈ వరల్డ్ కైండ్‌నెస్ డే లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ఉచితం. మరిన్ని వివరాల కోసం, ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం www.touchalife.org చూడండి.
Updated Date - 2022-11-04T19:37:51+05:30 IST