ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య, కొడుకుతో కలిసి బైక్‌పై ప్రయాణం.. స్థంభం నుంచి తెగి వేలాడుతున్న కరెంట్ వైర్ తగలడంతో ఘోరం..!

ABN, First Publish Date - 2022-01-26T18:25:51+05:30

అతను తన భార్య, కొడుకుతో కలిసి బైక్‌పై బయల్దేరాడు.. ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలనుకున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను తన భార్య, కొడుకుతో కలిసి బైక్‌పై బయల్దేరాడు.. ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలనుకున్నాడు.. మార్గమధ్యంలో ఓ విద్యుత్ స్థంభం నుంచి తెగిన కరెంట్ వైరు వేలాడుతోంది.. అది అనుకోకుండా అతని బైక్‌కు తగిలింది.. వెంటనే ముగ్గురికీ తీవ్రంగా షాక్ కొట్టింది.. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.. చికిత్స తీసుకుంటూ ఆస్పత్రిలో ఇద్దరు ప్రాణాలు విడిచారు.. ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. 


రాజస్థాన్‌లోని మౌంట్ అబూ ప్రాంతానికి చెందిన భాయిల్ బాయ్ (37) తన భార్య కంచన్ (30), కొడుకు రుద్ర (7)తో కలిసి మంగళవారం సాయంత్రం హిమ్మత్ నగర్‌లోని దేవాలయ దర్శనానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో పుంద్ర నక్లంగ్ ప్రాంతంలో ఓ విద్యుత్ స్థంభం నుంచి తెగిపోయిన 11కేవీ వైరు వేలాడుతోంది. అది భాయిల్ బైక్‌కు తగిలింది. దీంతో షాక్ కొట్టడంతో ముగ్గురూ బైక్‌పై నుంచి కింద పడిపోయారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. 


స్థానిక పీహెచ్‌సీలో చికిత్స చేసిన వైద్యులు ముగ్గురినీ మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ బుధవారం ఉదయం భాయిల్ బాయ్, రుద్ర మరణించారు. కంచన్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2022-01-26T18:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising