కూతురి పీకలమీదకు తెచ్చిన తండ్రి నిర్వాకం.. ఆమెను ప్రేమిస్తున్న కుర్రాడి వద్ద అప్పు తీసుకుని..
ABN, First Publish Date - 2022-04-30T14:26:00+05:30
కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన తప్పులకు వారి పిల్లలు బలవుతుంటారు. వివిధ అవసరాల కోసం అప్పులు చేసే తండ్రుల కారణంగా కుటుంబం మొత్తం ఇబ్బందుల...
కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన తప్పులకు వారి పిల్లలు బలవుతుంటారు. వివిధ అవసరాల కోసం అప్పులు చేసే తండ్రుల కారణంగా కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతుంటుంది. కొందరు తండ్రులు దురలవాట్లకు బానిసలై.. కుటుంబ బాధ్యతలు మరచి ప్రవర్తిస్తుంటారు. ఈ కారణంగా కూడా వారి పిల్లలు అవస్థలు పడుతుంటారు. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి చేసిన అప్పు కారణంగా అతడి కూతురు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కూతురిని ప్రేమిస్తున్న యువకుడి వద్ద అప్పు తీసుకున్నాడు. చివరకు అదే అతడి కూతురికి సమస్యలు తెచ్చి పెట్టింది. ఏం జరిగిందంటే..
రాజస్థాన్ రాష్ట్రం ప్రతాప్‌గఢ్ జిల్లా ఘంటాలి పరిధిలోని గ్రామానికి చెందిన బాలిక హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుకుంటోంది. శుక్రవారం పరీక్షలు రాసి హాస్టల్‌కు వెళ్తుండగా... కొందరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల విచారణలో బాలిక తండ్రి చేసిన నిర్వాకం బయటపడింది. మూడేళ్ల క్రితం ఘటిపరా అనే ప్రాంతానికి చెందిన శాంతిలాల్ అనే యువకుడు బాలికను ప్రేమిస్తుండేవాడు. వారిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకున్నారు.
సున్నం కొడుతుండగా.. స్టోర్ రూమ్‌లో బయటపడ్డ పాత సంచి మూటలు.. అనుమానం వచ్చి ఒకదాన్ని తెరచి చూడగా...
అయితే ఈ క్రమంలో బాలిక తండ్రి శాంతిలాల్ నంచి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. శాంతిలాల్‌తో సంబంధాన్ని వద్దనుకున్నారు. అయితే అతడికి ఇవ్వాల్సిన డబ్బును మాత్రం తిరిగి ఇవ్వలేదు. కూతురిని ఇచ్చి పెళ్లి చేయకపోగా.... తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాలిక తండ్రిపై శాంతిలాల్ కోపం పెంచుకున్నాడు. ఈ కోపంతోనే బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసు విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శాంతిలాల్ తదితరుల కోసం గాలిస్తున్నారు.
పెళ్లయినప్పటి నుంచి దిగులుగా ఉంటున్న యువతి.. మూడు నెలల తర్వాత.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి...
Updated Date - 2022-04-30T14:26:00+05:30 IST