ఈ తాతలో ఉన్న మ్యాజిక్ ఏంటో.. 61ఏళ్ళ వయసులో 88వ పెళ్ళి...
ABN, First Publish Date - 2022-11-03T15:15:13+05:30
ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం వెనక ఉన్న ఆయన ఆలోచన తెలిస్తే షాకవుతారు.
పెళ్ళి అనేది జీవితంలో ఒకసారే జరిగే వేడుక. కానీ పరిస్థితుల వల్ల కొందరు రెండో పెళ్లి చేసుకుంటూంటారు. మహా అయితే మూడోసారి పెళ్ళిపీటలు ఎక్కే వారూ అక్కడక్కడా కనిపిస్తుంటారు. కానీ ఈ తాత మాత్రం 61సంవత్సరాల వయసులో 88వ సారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. విచిత్రం ఏంటంటే.. మహిళలు కూడా ఇష్టపూర్వకంగానే ఈయనతో పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం వెనక ఉన్న ఆయన ఆలోచన తెలిస్తే షాకవుతారు.
ఇండోనేషియాలో మజలెంగ్కా ప్రాంతంలో నివసిస్తున్న కాన్ అనే వ్యక్తి ప్రస్తుత వయసు 61సంవత్సరాలు. ఈయన తన 14వ ఏటనే వయసులో తన కంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయిని మొదటిసారిగా పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి తరువాత కొంతకాలానికే కాన్కు తన భార్య విడాకులిచ్చింది. ఆ తరువాత ఇతడు శారీరక అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందిపడ్డాడు. అప్పుడే అతడికి ఒక ఆలోచన వచ్చింది. ఆధ్యాత్మికం అనే ముసుగులో ఆడవారిని మోసం చేయాలని భావించాడు. కానీ ఆ తర్వాత అతడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అనంతరం మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు అతడు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. తాజాగా మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. 86వ సారి పెళ్లి చేసుకుని విడిపోయిన మహిళనే ఈ తాత మరోమారు వివాహం చేసుకోబోతున్నాడట. ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడాన్ని చూసి ఇతడు.. కోటీశ్వరుడై ఉంటాడని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కాన్ ఒకసాధారణ రైతు.
కాగా.. 88వ పెళ్లిపై ఈ తాత ఓ క్లారిటీ ఇచ్చాడు. 86వ పెళ్లి చేసుకున్న మహిళ.. తన నుంచి విడిపోయినా ఇంకా ఆయననే ప్రేమిస్తోందంట. ఈ క్రమంలోనే ఆమెను తిరిగి పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు. ఏది ఏమైనా పెళ్ళి కావడం కష్టమైపోయి ముదుర్లుగా మారిపోతున్న అబ్బాయిలు కాన్ తాత విషయం తెలిసి తెల్లబోతున్నారనడంలో సందేహం లేదు.
Updated Date - 2022-11-03T15:15:15+05:30 IST