ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతిమరుపు తెచ్చిన అదృష్టం.. 67ఏళ్ల వయసులో కోటీశ్వరుడు ఎలా అయ్యాడంటే..

ABN, First Publish Date - 2022-10-27T20:23:39+05:30

మనిషిని అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో వరిస్తుందో ఎవరికీ తెలీదు. అప్పటి వరకూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు.. అనుకోకుండా కోటీశ్వరులవుతుంటారు. కొందరు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు.. చివరకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. యూఎస్‌కు చెందిన ఓ 67ఏళ్ల వ్యక్తి విషయంలో ఇలాగే జరిగింది. అతడి మతిమరుపే చివరకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషిని అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో వరిస్తుందో ఎవరికీ తెలీదు. అప్పటి వరకూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు.. అనుకోకుండా కోటీశ్వరులవుతుంటారు. కొందరు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు.. చివరకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. యూఎస్‌కు చెందిన ఓ 67ఏళ్ల వ్యక్తి విషయంలో ఇలాగే జరిగింది. అతడి మతిమరుపే చివరకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

దున్నపోతు తల సైకిల్‌లో ఇరుక్కుపోయిందిలా.. బయటపడేందుకు..

యూఎస్ (USA)లోని టోసన్ ప్రాంతానికి చెందిన 67ఏళ్ల వ్యక్తి.. అనుకోకుండా కోటీశ్వరుడయ్యాడు. ఇటీవల అతను ఓ దుకాణానికి వెళ్లి రెండు లాటరీ టికెట్లను (Lottery tickets) కొనుగోలు చేశాడు. అయితే ఆ విషయం అతను మర్చిపోయాడు. మరుసటి రోజు అదే దుకాణానికి వెళ్లి.. మళ్లీ ఇంకో టికెట్ కొన్నాడు. ఈ విషయం తెలిసి అనవసరంగా తప్పు చేశానే.. అని అనుకున్నాడు. అయితే అన్ని టికెట్లనూ 5-1-3-5-9 వచ్చేలా తీసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేదు. అయితే అనుకోకుండా మూడు టికెట్లపై మొత్తం రూ.1కోటి 22లక్షలు గెలుచుకున్నాడు.

Viral Video: వృద్ధురాలి పట్ల ఈ కుక్క పిల్ల తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో కూడా ఓసారి ఇలాగే జరిగిందని తెలిపాడు. తన కుమార్తె పుట్టిన సంవత్సరమైన 1979 నంబర్ వచ్చేలా లాటరీ టికెట్లు కొన్నానని, అయితే లాటరీ నిర్వాహకులు పొరపాటున 1997 నంబర్ మీద టికెట్ ఇచ్చారన్నారు. అయితే చివరకు ఆశ్చర్యకరంగా 1997 నంబర్ మీద లాటరీ గెలుచుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం గెలుచుకున్న మొత్తాన్ని తన ఇద్దరు కూతుళ్లకు సగం సగం పంచుతానని చెప్పాడు. గతంలో అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒకే నంబర్‌పై ఒక్కొక్కరు రూ.41లక్షలు గెలుచుకున్నారని లాటరీ నిర్వాహకులు తెలిపారు.

Viral Video: ఇంట్లో కొండచిలువను పెంచుకుంటున్న మహిళ.. గాజు బాక్సు మూత తీయడంతో ఒక్కసారిగా ఏం చేసిందో చూడండి

Updated Date - 2022-10-28T15:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising