తల్లి ఫోన్లో వీడియోను చూసి తానూ అలా చేయాలనుకున్నాడు.. పదేళ్ల పిల్లాడి మృతి కేసులో షాకింగ్ నిజాలు..!
ABN, First Publish Date - 2022-06-25T00:06:38+05:30
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో.. చిన్నా పెద్దా తేడా లేకుండా నిత్యం ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. కొందరు యువకులైతే పొద్దున నుంచి రాత్రి వరకూ నిత్యం సోషల్ మీడియాతోనే మమేకం అవుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది అందులోని...
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో.. చిన్నా పెద్దా తేడా లేకుండా నిత్యం ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. కొందరు యువకులైతే పొద్దున నుంచి రాత్రి వరకూ నిత్యం సోషల్ మీడియాతోనే మమేకం అవుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది అందులోని మంచి సమాచారాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే.. కొందరు మాత్రం మోసాలకు పాల్పడడమో, లేక మోసపోవడమో జరుగుతోంది. ఇక పిల్లల విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పెద్దల పర్యవేక్షణ లేని పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఢిల్లీలో ఇటీవల తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. తల్లి ఫోన్లో వీడియోను చూసిన పదేళ్ల బాలుడు.. తాను కూడా అలాగే చేయాలని ప్రయత్నించాడు. చివరకు ఏం జరిగిందంటే..
ఈశాన్య ఢిల్లీ పరిధిలోని కర్తార్ నగర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తల్లి ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇదిలావుండగా, వారి పెద్ద కొడుకైన పదేళ్ల బాలుడు.. రోజూ తన తల్లి ఫోన్‌లో గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం చేస్తుండేవాడు. అతడి తల్లి కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా ఆ బాలుడు.. తల్లి ఫోన్‌లో వీడియోలు చూస్తూ ఉన్నాడు. రాత్రి ఇద్దరూ వేర్వేరు గదుల్లో పడుకున్నారు. అయితే రాత్రి కూడా బాలుడు ఫోన్ చూస్తూనే ఉన్నాడు.
AIDS ఉన్న విషయం దాచి ఓ యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే..
ఈ క్రమంలో అతడు జంప్ రోప్ స్టంట్ వీడియో చూశాడు. తాను కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఓ రోప్ తీసుకుని వీడియో చూస్తూ అలాగే చేస్తూ ఉన్నాడు. అయితే జంప్ చేసే క్రమంలో తాడు పొరపాటున మెడకు చుట్టుకుని, ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
కాటికి కాళ్లు చాపే వయసులో జిమ్మాస్టర్‌గా ఘనత.. త్వరలో "మిస్టర్ ఆసియా" పోటీల్లో పాల్గొంటున్న ఆ 72 ఏళ్ల వ్యక్తి ఎవరో తెలుసా..
Updated Date - 2022-06-25T00:06:38+05:30 IST