ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడి కూసిందని పోలీస్ స్టేషవ్ కు వెళ్ళిన డాక్టర్.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్..

ABN, First Publish Date - 2022-12-01T13:50:34+05:30

అది అలారం కంటే దారుణంగా ఆపకుండా అరుస్తూనే ఉందట..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పుడు గ్రామాల్లో అలారం ఉండేది కాదు. వ్యవసాయం ఎక్కువ కాబట్టి కోడి కూయగానే సమయమెంత అనే పని లేకుండా లేచి పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండోర్ లో కూడా అలారమ్ ల నుండి కోళ్ళ వైపుకు ట్రెండ్ మారింది. అక్కడ ప్రతిరోజు కోళ్ళే నిద్రలేపుతున్నాయట. అయితే ఈ కోళ్ళు కూయడం వలన ఓ డాక్టర్ కు విసుగొచ్చింది. ఆయన తను హాస్పిటల్ కు వెళ్ళి డ్యూటీ చూసుకుని ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుంటాడట. అయితే పక్కింట్లో ఉన్న కోళ్ళు మాత్రం అలారం కంటే దారుణంగా ఆపకుండా అరుస్తూనే ఉన్నాయట. ఆ కోళ్ళ అరుపులకు మెలకువ వచ్చి మళ్ళీ నిద్రపోలేక ఈయన సరాసరి నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్ళి తన పరిస్థితి వివరించాడు.

ఆయన ఫిర్యాదు విన్న పోలీసులు కోడి కూయక గమ్మునుంటుందా అని మనసులో అనుకుని... ఆయన్ను సర్ధి చెప్పడానికి ప్రయత్నించారు. మీరు మీ పక్కింటి వాళ్ళు ఆరోగ్యకరంగా చర్చించుకుని సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఇక్కడ ఫిర్యాదు ఇవ్వండి అని నచ్చ జెప్పారు. అయితే ఆ డాక్టర్ మాత్రం వాళ్ళ ఇంట్లో కోళ్ళు మాత్రమే కాదు, బాగా మొరిగే కుక్కలు కూడా నాలుగున్నాయని తన గోడును పోలీసుల ముందు వెళ్లగక్కాడు. కుక్కలు, కోళ్ళు అరవక, మొరగక సైలెంట్ గా ఎలా ఉంటాయి చెప్మా.. అనుకుంటున్నారు నెటిజన్లు. ఆ పోలీసులు మాత్రం మీరు మాట్లాడిన తరువాత సమస్య పరిష్కారం కాకపోతే క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ 133 ప్రకారం చర్యలు తీసుకుంటాం లెండి అని డాక్టరును పంపేశారు.

Updated Date - 2022-12-01T13:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising