కల చెదిరింది.. కథ మారింది.. వధువును హెలికాఫ్టర్‌లో తీసుకొచ్చేందుకు లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకుంటే..
ABN, First Publish Date - 2022-05-20T18:43:22+05:30
అతను రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ కాలేజ్ నడుపుతున్నాడు.. తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని ఈ నెల 11న ఘనంగా చెయ్యాలనుకున్నాడు..
అతను రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ కాలేజ్ నడుపుతున్నాడు.. తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని ఈ నెల 11న ఘనంగా చెయ్యాలనుకున్నాడు.. వివాహం తర్వాత తొలిసారి తమ ఇంటికి రాబోతున్న కోడలిని హెలికాఫ్టర్‌లో తీసుకెళ్లాలనుకున్నాడు.. ఆ మేరకు హెలికాఫ్టర్‌ను అద్దెకు ఇచ్చే సంస్థ మేనేజర్‌తో మాట్లాడి రూ.4.85 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు.. మరో రూ.3 లక్షలు ఖర్చు పెట్టి కల్యాణ మండపం, తన ఇంటి దగ్గర హెలీప్యాడ్స్ నిర్మించాడు.. జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నాడు.. తీరా చూస్తే పెళ్లి రోజు హెలికాఫ్టర్ సంస్థ మేనేజర్ షాకిచ్చాడు.. సాంకేతిక కారణాల వల్ల హెలికాఫ్టర్ పంపడం కుదరదని చెప్పాడు.. దిగ్భ్రాంతికి గురైన ఆ వ్యక్తి హెలికాఫ్టర్ సంస్థ మేనజర్‌పై ఛీటింగ్ కేసు పెట్టాడు.
ఇది కూడా చదవండి..
మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు.. విషయం తెలిసి నేరుగా వధువు ఇంటికి వెళ్లిన ప్రేయసి.. చివరకు ఊహించని ట్విస్ట్..!
చురుకు చెందిన నరేంద్ర బరాల అనే వ్యక్తి తన కొడుకు నిఖిల్‌కు, శికా అనే యువతితో ఈ నెల 11న పెళ్లి ఫిక్స్ చేశాడు. వివాహం తర్వాత కోడలిని హెలికాఫ్టర్‌లో తమ ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. నెల రోజుల ముందుగానే హెలికాఫ్టర్‌ను అద్దెకు ఇచ్చే సంస్థ మేనేజర్‌తో మాట్లాడి రూ,11.25 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.4.85 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. రూ.3 లక్షలతో కల్యాణ మండపం, తన ఇంటి దగ్గర హెలీప్యాడ్స్ నిర్మించాడు. హెలీకాఫ్టర్ ఉపయోగించుకునేందుకు జిల్లా కలెక్టర్ నుంచి కూడా అనుమతి తీసుకున్నాడు. అయితే చివరి నిమిషంలో ఆ మేనేజర్ చేతులెత్తేశాడు.
సాంకేతిక కారణాల వల్ల హెలికాఫ్టర్ పంపడం కుదరదని చెప్పాడు. దీంతో నరేంద్ర అప్పటికప్పుడు బీఎమ్‌డబ్ల్యూ కారును అద్దెకు తీసుకుని కొడుకును, కోడలిని ఇంటికి పంపాడు. అనంతరం హెలికాఫ్టర్‌ను అద్దెకు ఇచ్చే సంస్థ మేనేజర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అడ్వాన్స్ ఇచ్చినా కూడా మేనేజర్ తనను మోసం చేశాడని, బంధుమిత్రులందరి ముందూ తన పరువు తీశాడని కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Updated Date - 2022-05-20T18:43:22+05:30 IST