ఇంటి ముందే ఆగిన స్కూల్ వ్యాన్.. ఫ్రెండ్స్‌కు టాటా చెప్పి దిగిన 4 ఏళ్ల పిల్లాడికి అదే ఆఖరి మాటయింది.. మరు క్షణంలోనే..
ABN, First Publish Date - 2022-04-21T01:56:20+05:30
ప్రస్తుతం చాలా పాఠశాలలు, కళాశాలలు... డబ్బే పరమావధిగా నడుస్తున్నాయి. ఫీజుల పేరుతో డబ్బులు దండుకోవడం తప్ప.. సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యంగా...
ప్రస్తుతం చాలా పాఠశాలలు, కళాశాలలు... డబ్బే పరమావధిగా నడుస్తున్నాయి. ఫీజుల పేరుతో డబ్బులు దండుకోవడం తప్ప.. సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి అలాంటి పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యానికి... అభం, శుభం తెలియని చిన్నారులు బలవుతుంటారు. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో తాజాగా విషాధ ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్ వ్యాన్ ఇంటి ముందు ఆగింది. నాలుగేళ్ల చిన్నారి ఇంటికి చేరుకున్నాననే ఆనందంలో స్నేహితులందరికీ టాటా చెప్పి దిగాడు. అయితే అదే, ఆ చిన్నారి ఆఖరి మాట అయ్యింది. మరు క్షణంలో జరిగిన ఘటన.. స్థానికులందరినీ శోకసంద్రంలో ముంచింది.
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో నివాసం ఉంటున్న దంపతులకు సిద్ధార్థ్(4)అనే కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానికంగా ఉన్న లిటిల్ వరల్డ్ ప్లే స్కూల్‌లో సిద్ధార్థ్ చదువుకుంటున్నాడు. చిన్నారి.. సోమవారం కూడా యథావిధిగా పాఠశాలకు బస్‌లో వెళ్లాడు. మధ్యాహ్నం పాఠశాల బస్సులో ఇంటికి బయలుదేరాడు. ఇంటి వద్ద బస్సు ఆపగానే చిన్నారి సంతోషంగా కిందకు దిగి, స్నేహితులందరికీ టాటా చెప్పాడు. అయితే అదే సమయంలో బస్సు ఒక్కసారిగా కదలడంతో టైరు కింద పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు.. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అమ్మా.. నాకు వేరే మార్గం లేదంటూ 21 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని ఘోరం.. ఆమె రాసిన లేఖలో..
అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కళ్ల ముందే ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు చిన్నారి మృతిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు లక్షలు ఫీజులు తీసుకునే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. బస్సుకు కండక్టర్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి నీచులను ఏం చేయాలి..? 2 నెలల పాపను ఆ 23 ఏళ్ల యువకుడు ఆడిస్తున్నాడనుకున్నారు.. కానీ..
Updated Date - 2022-04-21T01:56:20+05:30 IST