ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 day week: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏకంగా 100 కంపెనీలు ఒకేసారి చెప్పిన గుడ్ న్యూస్

ABN, First Publish Date - 2022-11-28T17:06:36+05:30

బ్రిటన్‌లోని 100 కంపెనీలు తాజాగా తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. ఇకపై వారంలో నాలుగు రోజులే పనిచేసేలా ఫోర్ డే వీక్ విధానానికి నాంది పలికాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితులు ప్రస్తుతం టెక్ రంగంలో నెలకొన్నాయి. ఈ భయాలు ఇతర రంగాలకు పాకుతున్నాయి. ఆర్థికమాంద్యం(Recession) తప్పదన్న అంచనాతో అనేక కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి టైంలో బ్రిటన్‌లోని(UK) 100 కంపెనీలు తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. ఇకపై వారంలో నాలుగు రోజులే పనిచేసేలా ఫోర్ డే వీక్(4-Day Week) విధానానికి నాంది పలికాయి.

బ్రిటన్‌కు చెందిన మొత్తం 100 కంపెనీలు తాజాగా ‘వారానికి 4 పనిదినాలు’ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించాయి. వీటిలో ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఆటమ్ బ్యాంక్(Atom Bank), మార్కెటింగ్ దిగ్గజం అవిన్‌కు(Awin) చెందిన బ్రిటన్ శాఖలు కూడా ఉండటం గమనార్హం. ఈ వంద కంపెనీల్లో మొత్తం 2600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థలన్నీ ‘ఫోర్ డే వీక్’ విధానాన్ని నిజాయతీతో అమలు చేస్తున్నాయి. అంటే.. జీతాల్లో కోత పెట్టకుండా.. పని గంటలు పెంచకుండానే ఉద్యోగులకు ‘ఫోర్ డే వీక్‌’’ అవకాశం కల్పించాయి.

తమ కంపెనీ చరిత్రలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పుల్లో ఫోర్ డే వీక్ పాలసీ ఒకటని అవిన్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ రాస్ పేర్కొన్నారు. ఈ పాలసీ యాజమాన్యాలకు, ఉద్యోగులకు లాభదాయకంగా మారిందన్నారు. ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యం పెరగడంతో పాటు కస్టమర్లతో తమ కంపెనీ సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని చెప్పారు. ఈ పరిణామాలు.. ఓ నిర్మాణాత్మక మార్పుకు నాది పలుకుతాయని ‘ఫోర్ డే వీక్’ మద్దతుదారులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పని సంస్కృతి ఒకప్పటి ఆర్థికవ్యవస్థ తాలూకు అవశేషమని ‘ఫోర్ డే వీక్’ మద్దతుదారులు చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి రావాలనే ఆశయంతో బ్రిటన్ వేదికగా ‘4 డే వీక్ క్యాంపెయిన్ గ్రూప్’ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో ఉద్యో్గుల ఉత్పాదకత ఇనుమడిస్తుందని చెబుతున్నారు. వారానికి సరిపడా పని నాలుగు రోజుల్లోనే జరిగిపోతుందనీ.. అదీ రోజువారీ పనిగంటల పెంచుకుండానే ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు.

‘4డే వీక్ క్యాంపెయిన్’ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ‘ వారానికి నాలుగు పనిదినాల’ విధానాన్ని ఓ పైలట్ ప్రాజెక్టు రూపంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. మొత్తం 70 కంపెనీలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. సెప్టెంబర్ నెలలో ఈ ప్రాజెక్టుపై సమీక్ష జరిగింది. ఈ విధానం తమకు లాభదాయకంగా ఉందని ఈ సందర్భంగా కంపెనీల యాజమాన్యాలు తెలిపాయి. ఉద్యోగుల ఉత్పాదక పెరగడం లేదా అదే స్థాయిలో కొనసాగినట్టు పైలట్ ప్రాజెక్టులో పాల్గొన్న 95 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.

ఆర్థికమాంద్యం కమ్ముకొస్తున్న సమయంలోనూ అనేక కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నాయని ‘4డే వీక్ క్యాంపెయిన్’ యూకే విభాగం డైరెక్టర్ జో రైల్ తెలిపారు. ఈ దశాబ్దం చివరి కల్లా ప్రపంచంలోని మెజారిటీ కంపెనీలు నాలుగు పనిదినాల విధానానికి మారిపోతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాబోయే కాలంలో మరిన్ని కంపెనీలు తమ క్యాంపెయిన్‌లో భాగమై..ఫోర్ డే వీక్ విధానాన్ని అమలు చేస్తాయని చెప్పారు.

Updated Date - 2022-11-28T17:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising