ప్లాట్‌ఫారమ్‌పై భార్యతో మాట్లాడుతున్న భర్త.. తీరా ట్రైన్ దగ్గరికి రాగానే అతడు చేసిన నిర్వాకం..
ABN, First Publish Date - 2022-08-25T01:46:06+05:30
సమస్యలు ఎన్ని వచ్చినా సర్దుకుపోయే దంపతులు (couple) చాలా మంది ఉంటారు. అలాగే చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసి.. చివరకు దారుణాలకు పాల్పడే భర్తలను కూడా చూస్తూనే...
సమస్యలు ఎన్ని వచ్చినా సర్దుకుపోయే దంపతులు (couple) చాలా మంది ఉంటారు. అలాగే చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసి.. చివరకు దారుణాలకు పాల్పడే భర్తలను కూడా చూస్తూనే ఉన్నాం. అనుమానం పెంచుకుని కొందరు.. అదనపు కట్నం ఆశతో మరికొందరు.. తప్పు తప్పు చేస్తుంటారు. కొందరైతే చివరకు హత్యలు చేయడానికి కూడా వెనకాడరు. తాజాగా, ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై (Railway platform) భార్యతో ప్రేమగా మాట్లాడుతున్న భర్త.. ట్రైన్ దగ్గరికి రాగానే సడన్‌గా దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.
ముంబైకి (Mumbai) సమీపంలోని పాల్ఘర్ జిల్లా వసాయి రైల్వే స్టేషన్(Vasai Railway Station)లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేకువజాము 4:10 గంటల సమయంలో ఓ వ్యక్తి భార్య, పిల్లలతో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్నాడు. పిల్లలతో పాటూ పడుకుని ఉన్న భార్యను నిద్ర లేపి, పక్కకు తీసుకెళ్తాడు. చాలా సేపు ఏదో విషయమై మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఎక్స్‌ప్రెస్ రైలు వస్తూ ఉంటుంది. రైలు సమీపానికి రాగానే భార్యను ఒక్కసారిగా పట్టాల మీదకు తోసేస్తాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంది. తర్వాత వెంటనే పడుకుని ఉన్న పిల్లలను నిద్ర లేపి, అక్కడి నుంచి వారిని తీసుకుని ఉడాయిస్తాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అవుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని, మంగళవారం రాత్రి భివాండి పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
7ఏళ్ల కూతురి ఎదుటే తండ్రి చేసిన నిర్వాకం.. ఘటన జరిగిన కాసేపటికే అతను తీసుకున్న అనూహ్య నిర్ణయంతో..
Updated Date - 2022-08-25T01:46:06+05:30 IST