ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళ్ల పారాణి ఆరకముందే.. ఆస్పత్రిలో చేరిన యువతి.. ఇంటి బయట నీళ్లు పడుతుండగా ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..

ABN, First Publish Date - 2022-08-27T22:24:13+05:30

ఏ నిముషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ.. అని ఓ కవి అన్నట్లుగా ఆనందంగా సాగుతున్న జీవితాల్లో ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు (Unexpected accidents)..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ నిముషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ.. అని ఓ కవి అన్నట్లుగా ఆనందంగా సాగుతున్న జీవితాల్లో ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు (Unexpected accidents) సంభవిస్తుంటాయి. అప్పటిదాకా ఆనందంగా ఉన్నవారు అనూహ్యంగా అనుకోని కష్టాలను ఎదుర్కోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. బీహార్‌లో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. కొత్తగా పెళ్లయిన ఓ యువతి.. కాళ్లపారాణి ఆరకముందే ఆస్పత్రి పాలైంది. నీళ్లు పడుతుండగా ఉన్నట్టుండి అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.


బీహార్ (Bihar) రాష్ట్రం గోపాల్‌గంజ్‌‌లోని ఫుల్వారియా పరిధి సోంగాధ్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సత్యేంద్ర యాదవ్‌కు.. ఇటీవలే దేవి అనే యువతితో వివాహమైంది. కొన్ని రోజుల క్రితం అత్తగారింటికి వచ్చిన యువతి.. అందరితో సంతోషంగా గడుపుతుండగా, అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఇంటి ఆవరణలోని తొట్టిలో నీరు పడుతుండగా.. పక్కనే ఉన్న డ్రైన్ నుంచి ఓ పాము సడన్‌గా పైకి వచ్చింది. దేవి కాలిపై కాటు వేసి (snake bite) పారిపోయింది. దీంతో కొద్దిసేపటికి ఆమె అపస్మారక స్థితికి (unconsciousness) చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన స్థానిక వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం ఆమెను గోపాల్‌గంజ్‌ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. గోపాల్‌గంజ్‌ జిల్లాలో పాము కాటు కేసులు ఇటీవల పెరిగిపోయాయని స్థానికులు చెబుతున్నారు. రోజూ ఎక్కడోచోట ఎవరో ఒకరు పాము కాటుకు గురవుతున్నారని తెలిపారు. 

ప్రేమికుడికి పెళ్లవడంతో అతడి సోదరుడిని ప్రేమించిన యువతి.. అతనూ ఊరు విడిచి వెళ్లడంతో.. మూడో వ్యక్తితో వివాహం.. చివరకు ఓ రోజు..



Updated Date - 2022-08-27T22:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising