ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral photo: ఆ పార్కులో ఇలాంటి పనులు అస్సలు చేయొద్దట.. బోర్డు చూసి అవాక్కవుతున్న సందర్శకులు..

ABN, First Publish Date - 2022-07-14T02:05:49+05:30

పగలంతా కష్టపడిన వారు సాయంత్రం కాసేపు సేద తీరేందుకు పార్కులకు వెళ్తుంటారు. కొందరు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడానికి వెళ్తుంటారు. ఇంకొందరు రన్నింగ్ చేయడానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పగలంతా కష్టపడిన వారు సాయంత్రం కాసేపు సేద తీరేందుకు పార్కులకు వెళ్తుంటారు. కొందరు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడానికి వెళ్తుంటారు. ఇంకొందరు రన్నింగ్ చేయడానికి వెళ్తారు. అయితే మరికొందరు మాత్రం తమ ప్రియురాలితో కలిసి జాలీగా గడిపేందుకు పార్కులకు వెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని పార్కుల్లో కొన్ని కొన్ని కార్యకలాపాలు చేయకుండా నిషేధం విధిస్తుంటారు. జంతువులను తీసుకెళ్లడం, ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయడం, అసభ్యకర పనులు చేయడం తదితరాలపై నిషేధం విధిస్తూ హెచ్చరిక బోర్డులు పెట్టడం చూస్తుంటాం. అయితే బెంగళూరులోని ఓ పార్కు ముందు పెట్టిన బోర్డు చూసి సందర్శకులు అవాక్కవుతున్నారు. ఇదెక్కడి పార్కురా నాయనా! ఇలాంటి నిబంధనలు ఎప్పుడూ వినలేదే.. అని అంటున్నారు.


BBMP (బృహత్ బెంగళూరు మహానగర పాలికే) సంస్థ.. ఈ వింత నిబంధనలు విధిస్తూ బోర్డును పార్కులో ఏర్పాటు చేసింది. అందులో ఏముందంటే.. ‘‘ ఈ పార్కులో జాగింగ్ చేయొద్దు.. రన్నింగ్ చేయొద్దు.. యాంటీ క్లాక్ తరహాలో నడవడం కూడా నిషేధం’’ అంటూ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. నడవడం కోసం, రన్నింగ్ చేయడం కోసం కాకపోతే.. ఇక ఈ పార్కులో ఏం చేయాలి.. అంటూ ఒకరు ప్రశ్నించగా.. నడవకపోతే పాకుతూ వెళ్లాలా.. అంటూ మరొకరు.. ఓహో! నాగిని డ్యాన్స్ లేదా మూన్‌వాక్ చేయమంటారా.. అంటూ ఇంకొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: చిన్నారికి.. ఈ పిల్లి చేసే మసాజ్ చూశారంటే.. ముక్కున వేలేసుకుంటారు..



Updated Date - 2022-07-14T02:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising