ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పులి పిల్లలపై మనసు పారేసుకున్న పిల్ల చింపాజీ.. నీ ప్రేమ తగలెయ్య.. అని పక్కకు వెళ్తున్నా..

ABN, First Publish Date - 2022-10-14T01:53:52+05:30

ప్రేమకు జాతి, కులం, మతం ఉండవంటారు. ఇది మనుషుల్లోనే కాదు.. అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ బయటపడుతుంటుంది. కోతులు, కుక్కలు.. పిల్లులు, ఎలుకలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమకు జాతి, కులం, మతం ఉండవంటారు. ఇది మనుషుల్లోనే కాదు.. అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ బయటపడుతుంటుంది. కోతులు, కుక్కలు.. పిల్లులు, ఎలుకలు.. ఇలా బద్ధశత్రువులైన జంతువులను కూడా కొన్నిసార్లు ప్రేమ దగ్గర చేస్తూ ఉంటుంది. అంతా ఆశ్చర్యపోయేలా వాటి స్నేహం ఉంటుంది. వీటిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి.. అనే సందేశాన్ని అప్పుడప్పుడూ ఇస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో రోజూ కోకొళ్లలుగా (animals Viral videos) దర్శనమిస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పులి పిల్లలపై ఓ పిల్ల చింపాంజి.. మనసు మారేసుకుంది. వద్దు వద్దు అంటున్నా వాటిని ప్రేమతో దగ్గర తీసుకోవడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


జంతు సంరక్షణ శాలలో ఓ పిల్ల చింపాజీ, రెండు పులి పిల్లలు ఆడుకుంటూ ఉంటాయి. అంతలో వాటిపై చింపాజీకి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తుంది. తెల్ల పులిని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టాలని చూస్తుంది. నీ ప్రేమ తగలెయ్య.. నేను పోతా.. అంటూ అది వెనక్కు వెళ్తున్నా విడవకుండా వెంటపడుతుంది. అంతలో మరో పులి పిల్ల.. ఆడుకుందాం రా.. అన్నట్లుగా దాని వద్దకు వెళ్తుంది. పోనీలే నువ్వు అయినా వచ్చావ్.. అని అనుకుంటూ దాని ప్రేమ మొత్తం పులి పిల్లపై చూపిస్తుంది. దగ్గరకు తీసుకుని ముద్దుల వర్షం కురిపిస్తుంది. ప్రంపంచాన్ని పూర్తిగా మర్చిపోయిన చింపాజీ, పులి పిల్లలు.. ఎంతో ప్రేమతో ఆడుకోవడం.. నెటిజన్లను కట్టిపడేస్తోంది. మనుషుల్లో లేని స్వచ్ఛమైన ప్రేమను జంతువుల్లో చూస్తున్నాం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

snake video: బూటులో కాలు పెడుతుండగా బుసకొట్టిన పాము.. వైరల్ అవుతున్న వీడియో..





Updated Date - 2022-10-14T01:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising