ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో! ఈ దున్నపోతు ఏంట్రా.. ఆటోకు ఎదురొచ్చి మరీ ఇలా చేసింది..

ABN, First Publish Date - 2022-09-22T22:38:44+05:30

బాహుబలి సినిమాలో బలమైన దున్నపోతును చాలా మంది చూసుంటారు. అలాంటి జంతువులను నిజంగా చూడటం సాధ్యమేనా అని చూసిన వారికి అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాహుబలి సినిమాలో బలమైన దున్నపోతును చాలా మంది చూసుంటారు. అలాంటి జంతువులను నిజంగా చూడటం సాధ్యమేనా అని చూసిన వారికి అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని దున్నపోతును చూస్తే.. ఆ డౌట్ తీరిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన ఘటనలో అదృష్టం బాగుండి.. ఎవరికీ ఏం కాలేదు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగుండేదని.. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆటోకు ఎదురుగా వచ్చిన ఓ బలమైన దున్నపోతు.. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఈ ఘటన కేరళలో (Kerala) లో చోటు చేసుకుంది. ఓ అటవీ ప్రాంతంలోని రోడ్డులో రాత్రి వేళ వాహనాలు వెళ్తుండగా.. అనుకోకుండా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఓ ఆటో ముందు వెళ్తుండగా.. వెనుకే మరికొన్ని వాహనాలు వెళ్తుంటాయి. అయితే మార్గ మధ్యలో ఓ పెద్ద దున్నపోతు సడన్‌గా రోడ్డుపైకి వస్తుంది. దాన్ని చూడగానే ఆటో డ్రైవర్ వెంటనే ఆపేస్తాడు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న దున్నపోతు.. ఆటోను చూడగానే మరింత రెచ్చిపోతుంది. వేగంగా వచ్చి కొమ్ములతో ఒక్కసారిగా ఆటోను ఎత్తి పడేస్తుంది. అయితే ప్రయాణికులు ఆటోను గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అంతటితో శాంతించిన దున్నపోతు.. మళ్లీ ఆటోపై దాడి చేసేందుకు వస్తుంది. అయితే డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ఆటోను వెనక్కు మళ్లిస్తాడు. కొద్దిసేపు అక్కడే ఉన్న దున్నపోతు.. తర్వాత వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా..





Updated Date - 2022-09-22T22:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising