ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చిన్నారికి.. ఈ పిల్లి చేసే మసాజ్ చూశారంటే.. ముక్కున వేలేసుకుంటారు..

ABN, First Publish Date - 2022-07-14T01:10:05+05:30

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని జంతువులు అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటాయి. చింపాంజీలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని జంతువులు అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటాయి. చింపాంజీలు, కోతులు, కుక్కలు తదితర జంతువులకు సంబంధించిన వీడియోలను చాలా చూసుంటాం. ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిద్రపోతున్న చిన్నారి వద్దకు వెళ్లిన పిల్లి.. ఎంతో ప్రేమతో, సుతిమెత్తగా మసాజ్ చేయడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇలాంటి పిల్లులు కూడా ఉంటాయా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ బెడ్‌పై చిన్నారి పడుకుని ఉంటుంది. ఆ ఇంట్లోని పెంపుడు పిల్లి.. మెల్లిగా మంచం పైకి వెళ్తుంది. చిన్నారికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా మసాజ్ చేయడం మొదలెడుతుంది. కేవలం ముందు కాళ్లను చిన్నారిపై ఉంచి.. సుతిమెత్తగా మసాజ్ చేస్తుంది. చిన్నారి కూడా మసాజ్‌ను ఆస్వాదిస్తున్నట్లుగా... హాయిగా నిద్రపోతుంటాడు. ఈ ఘటనను మొత్తం యజమాని తన కెమెరాలో బంధిస్తాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. వావ్! ఈ పిల్లికి మసాజ్ చేయడం బాగా వచ్చే.. అంటూ ఒకరు.. ఇలాంటి పిల్లి ఉంటే ఓ మసాజ్ సెంటర్ నడపొచ్చు.. అంటూ మరొకరు.. ఇంతకీ మసాజ్ చేయడానికి ఈ పిల్లి ఎంత చార్జ్ చేస్తుంది.. అని మరికొందరు చమత్కరిస్తున్నారు.

robbery: సంచి నిండా cash ఉందనుకుని.. బెదిరించి మరీ లాక్కెళ్లారు.. బాధితుడు చెప్పింది విని అవాక్కయిన పోలీసులు..





Updated Date - 2022-07-14T01:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising