ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మహిళ వెనుకే వెళ్లిన నక్క.. ఆదమరచి ఉన్న సమయంలో.. అదును చూసి ఒక్కసారిగా..

ABN, First Publish Date - 2022-08-25T23:58:37+05:30

కొన్నిసార్లు కొన్ని జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఎప్పటి నుంచో శత్రుత్వం ఉన్నట్టు.. మనుషులపై గుర్తు పెట్టుకుని మరీ దాడి చేస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు కొన్ని జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఎప్పటి నుంచో శత్రుత్వం ఉన్నట్టు.. మనుషులపై గుర్తు పెట్టుకుని మరీ దాడి చేస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ నక్కకు (fox) ఆ మహిళ అంటే విపరీతమైన కోపం ఉన్నట్టుంది. దానికి ఆమె ఏం అన్యాయం చేసిందో ఏమో గానీ.. అదును చూసి మరీ దాడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


అమెరికాలో (America) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పార్కులో నడుచుకుంటూ (Woman walking in the park) వెళ్తుంటుంది. అక్కడే ఉన్న ఓ నక్క ఆమెనే ఫాలో అవుతుంటుంది. ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్లిన ఆమె.. ఓ చోట నిలబడి ఉంటుంది. ఆమె వెనుకే వెళ్లిన నక్క.. ఒక్కసారిగా ఆమెపై వెనుక నుంచి దాడికి పాల్పడుతుంది. నోటితో కాలును గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆమె ఉలిక్కిపడుతుంది. ఎంత విదిలించినా నక్క మాత్రం ఆమెను పదే పదే కరవడానికి ప్రయత్నిస్తుంది. అయినా ఆమె భయపడకుండా దాన్ని కాలితో తన్నుతూ పక్కకు నెడుతుంటుంది. ఇలా చాలా సేపు దాన్ని పక్కకు నెట్టేయాలని ప్రయత్నించినా.. నక్క మాత్రం మరింత కోపంతో ఆమెపై దాడికి పాల్పడుతుంది. చివరకు ఆమె చేతిని కూడా గట్టిగా కొరికేస్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి కర్రతో వచ్చి నక్కను తరిమికొడతాడు. ఈ దాడిలో మహిళ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డు అయింది. వామ్మో! ఇదెక్కడి నక్కరా.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తీర్థం తీసుకోగానే మూర్ఛపోతున్న యువతి.. ఐదేళ్ల అనంతరం పెళ్లి ప్రయత్నాలు చేస్తుండగా.. అసలు విషయం తెలిసి..





Updated Date - 2022-08-25T23:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising