ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ట్రైన్‌కు వేళాడుతూ ఇన్‌స్టా రీల్ కోసం ఓ కుర్రాడి రిస్కీ ఫీట్.. చివరకు జరిగిందో వీడియోలో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2022-10-12T21:10:47+05:30

ప్రస్తుత యువతకు సోషల్ మీడియాలో (Social media) ఫేమస్ అవ్వాలనే ఆరాటం పెరిగిపోయింది. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో చాలా మంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత యువతకు సోషల్ మీడియాలో (Social media) ఫేమస్ అవ్వాలనే ఆరాటం పెరిగిపోయింది. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా విన్యాసాలు చేయడానికి సాహసిస్తున్నారు. అందరిలా కాకుండా భిన్నంగా చేయాలనే తపనతో చివరకు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా తదితర వేదికల్లో రీల్స్‌ చేయడం వ్యసనంగా మారిపోయింది. రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral videos) కూడా ఇలాంటిదే. ఇన్‌స్టా రీల్ కోసం ఓ యువకుడు ట్రైన్‌కు వేళాడుతూ రిస్కీ ఫీట్ చేసేందుకు సిద్ధపడ్డాడు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఢిల్లీ వెళ్తున్న మాల్వా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బోగీ డోరు వద్ద వేలాడుతూ ఇన్‌స్టా రీల్ (Insta Reels) చేయడానికి ప్రయత్నించాడు. మరో వ్యక్తి కిటికీ నుంచి వీడియో తీస్తుండగా.. ఆ యువకుడు డోరు వద్ద వేలాడుతూ ఉన్నాడు. అప్పటికే రైలు అతి వేగంగా వెళ్తోంది. కాసేపటికే ఊహించని ఘటన చోటు చేసుకుంది. కెమెరాకు ఫోజులిస్తూ పట్టాల పక్కన ఉన్న స్తంభాన్ని గుర్తించలేదు. తీరా తగ్గరికి వచ్చాక తప్పించుకునే క్రమంలో చేయి తగిలి.. ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన ప్రయాణికులు అధికారులకు తెలపగా రైలును నిలిపేశారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఖన్నా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. యువకుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలపై మానసిక వైద్యులు మాట్లాడుతూ.. రీల్స్ చేయడం ఒక రకమైన వ్యసనమని తెలిపారు. మెదడులో డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా విడుదలవడం వల్ల.. ప్రమాదమని తెలిసినా ఇలాంటి పనులను చేసేందుకు సిద్ధపడుతుంటారని వివరించారు. పిల్లలకు తల్లిదండ్రులు తరచూ అవగాహన కల్పిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

Viral Video: గుర్రంపై మనుషుల సవారీ మామూలే.. ఈ జింకపై కోతి సవారీ చూశారంటే అవాక్కవుతారు..





Updated Date - 2022-10-12T21:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising