ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pilot warning Video: విమానం గాల్లో ఉండగా అదే పనిగా పైలట్‌కు నగ్న ఫొటోలను పంపిస్తున్న ప్రయాణికులు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-09-03T00:47:46+05:30

విమాన పైలట్లు, ప్రయాణికులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. విధుల్లో ఉన్న సమయంలో కొన్నిసార్లు విమానయాన సిబ్బందికి విచిత్ర సమస్యలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విమాన పైలట్లు, ప్రయాణికులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. విధుల్లో ఉన్న సమయంలో కొన్నిసార్లు విమానయాన సిబ్బందికి విచిత్ర సమస్యలు ఎదురవుతుంటాయి. ఇందుకు సంబంధించిన వార్తలు తరచూ వింటూనే ఉంటాం. ప్రస్తుతం సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ (Southwest Airlines) పైలట్‌కు వింత అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా.. ప్రయాణికులు అదే పనిగా పైలట్‌కు నగ్న ఫొటోలు పంపడం మొదలెట్టారు. దీంతో చివరకు ఏం జరిగిందంటే..


హ్యూస్టన్‌లోని విలియం పి.హాబీ ఎయిర్‌పోర్ట్ (Airport) నుండి మెక్సికోలోని (Mexico) కాబో శాన్ లూకాస్‌కు వెళ్లే విమానంలో ఈ సంఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగా ప్రయాణికులు ఎయిర్‌డ్రాప్ (AirDrop) ద్వారా పైలట్‌కు నగ్న చిత్రాలను పంపారు. ముందు లైట్‌గా తీసుకున్న పైలట్.. వరుసగా అవే ఫొటోలు వస్తుండడంతో అసహనానికి గురయ్యాడు. ఇంటర్‌కామ్‌ ద్వారా సదరు ప్రయాణికులను హెచ్చరించాడు. ‘‘ ఇలాగే అశ్లీల ఫొటోలు పంపుతూనే ఉంటే అంతా విమానం దిగిపోవాల్సి వస్తుంది. మేము సెక్యూరిటీకి కాల్ చేయాల్సి ఉంటుంది’’.. అంటూ గట్టిగా మందలించాడు.

భార్యపై కోపం.. ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్లి మరీ మహిళ పేరుతో ఓ సిమ్‌ను కొని ఓ భర్త మాస్టర్ ప్లాన్.. చివరకు..


ఆ సమయంలో లోపల ఉన్న ప్రయాణికులు కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎయిర్‌డ్రాప్ ద్వారా, ఐఫోన్ వినియోగదారులు Wi-Fi, సెల్యులార్ డేటాను కూడా ఉపయోగించకుండా ఇతర ఆపిల్ వినియోగదారులకు డిజిటల్ ఫైల్‌లను పంపవచ్చని తెలిసింది. ఈ వీడియోపై ఎయిర్‌లైన్ కంపెనీ కూడా స్పందించింది. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సే.. మా ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. అయితే ఈ వీడియో నిజామా లేదా అనే విషయాన్ని ఇప్పుడే తేల్చలేమని తెలిపింది. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Cameras in School Toilets: బాత్రూంలలో సీసీ కెమెరాలు.. అధికారులు నిలదీస్తే స్కూలు యాజమాన్యం చెప్పిన కారణం విని..



Updated Date - 2022-09-03T00:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising