Viral Video: రోడ్డుపై ఇలాంటి కారు డ్రైవర్లు కూడా ఉంటారు.. కాస్త చూసుకుని వెళ్లండి..
ABN, First Publish Date - 2022-09-30T02:49:12+05:30
ఒకరి నిర్లక్ష్యం కొన్నిసార్లు.. ఇంకొకరికి ప్రాణసంకటంగా మారుతుంటుంది. ప్రయాణ సమయాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. ఎలాంటి అనుభవమూ లేకున్నా..
ఒకరి నిర్లక్ష్యం కొన్నిసార్లు.. ఇంకొకరికి ప్రాణసంకటంగా మారుతుంటుంది. ప్రయాణ సమయాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. ఎలాంటి అనుభవమూ లేకున్నా వాహనం తీసుకుని రోడ్డుపైకి వచ్చే వారు కొందరైతే.. అన్నీ తెలిసినా నిబంధనలు పాటించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించేవారు ఇంకొందరు ఉంటారు. వీరి కారణంగా సక్రమంగా వెళ్తున్న వారు కూడా ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో (Viral photos and videos) తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలకు గురయ్యారు.
కర్నాటకలో (Karnataka) జరిగిన ఓ రోడ్డు ప్రమాద వీడియోను.. బెంగళూరు డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ కళా కృష్ణస్వామి.. తన ట్విటర్ ఖాతాలో (Twitter account) షేర్ చేశారు. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి కారు నిలుపుకొని ఉంటాడు. అదే సమయంలో వెనుక నుంచి ఇద్దరు యువకులు బైకులో వస్తుంటారు. తీరా కారు వద్దకు రాగానే డ్రైవర్.. ఒక్కసారిగా డోరును తెరుస్తాడు. కారు డోరు తగలడంతో బైకు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఓ లారీ మీదకు వెళ్తుంది. ఇద్దరూ లారీ టైర్లకు తగులుకుని పక్కకు ఎగిరిపడతారు. వీరిని గమనించిన లారీ డ్రైవర్.. వాహనాన్ని నిలిపేస్తాడు. అయితే అప్పటికే కిందపడ్డ యువకులు అపస్మారక స్థితికి చేరుకుని ఉంటారు. తర్వాత కారు డ్రైవర్.. తాపీగా అక్కడికి వచ్చి గమనిస్తాడు. స్థానికులంతా కలిసి తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరు వ్యక్తుల ప్రాణాల మీదకు వచ్చింది. చాలా కాలం క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ATM Pin Number: ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కేవలం 4 అక్షరాలే ఎందుకు ఉంటాయి..? అసలు కారణాలివే..!
Updated Date - 2022-09-30T02:49:12+05:30 IST