ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 ఏళ్ల క్రితం పెళ్లి.. అప్పటికే ముగ్గురు కూతుళ్లు.. కొడుకు కోసం ఆ తండ్రి ఆశపడితే నాలుగోసారి ఒకే కాన్పులో ముగ్గురు కూతుళ్లు..!

ABN, First Publish Date - 2022-09-03T22:16:35+05:30

‘‘కొడుకు ఉంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు’’.. చాలా మంది ఇదే ఆలోచనతో ఉంటారు. కూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని అనుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. పైగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘కొడుకు ఉంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు’’.. చాలా మంది ఇదే ఆలోచనతో ఉంటారు. కూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని అనుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. పైగా జీవితాంతం వారిపై చిన్నచూపు చూస్తుంటారు. మరికొందరైతే.. గర్భిణిగా ఉన్న సమయంలోనే స్కానింగ్ చేయించి, కూతురు అని తెలిస్తే.. ఏమాత్రం కనికరం లేకుండా అబార్షన్ చేయిస్తుంటారు. ఇలాంటి వారిని రోజూ ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి.. అప్పటికే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కానీ కొడుకు కావాలని అనుకున్నాడు. అయితే నాలుగోసారి ఒకే కాన్పులో ముగ్గురు కూతుళ్లు జన్మించారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజ్‌గఢ్‌ పరిధి నార్సింగ్‌గఢ్‌లోని మన్ పిచోడి గ్రామంలో రాకేష్ తిరారీ, సీమా తివారీ దంపతులు (couple) నివాసం ఉంటున్నారు. వీరికి 2013లో వివాహం అవగా.. 2020నాటికి వీరికి.. మనీషా (7), దీపిక (5), సాక్షి (2) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయినా రాకేష్ మాత్రం.. కొడుకు కావాలని ఆశపడేవాడు. ఈ క్రమంలో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి కొడుకు పుడతాడని అంతా అనుకున్నారు. గురువారం సాయంత్రం సీమా తివారీకి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒకే కాన్పులో మళ్లీ ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చింది. తల్లీ, శిశువులంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

భార్య చనిపోయిన నెల తర్వాత వీడియో విడుదల చేసిన భర్త.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకునే లోపే..


మొదటి బిడ్డ 2.4 కిలోల బరువు ఉండగా, రెండో బిడ్డ 2, మూడో బిడ్డ 2.2కిలోలు ఉంది. మళ్లీ కూతుళ్లే జన్మించడంతో మొదట నిరాశపడిన రాకేష్.. చివరకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన కోరిక తీరలేదని, కానీ కూతుళ్లు పుట్టినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ముగ్గురు నవజాత శిశువులకు గంగ, జమున, సరస్వతి అని పేర్లు పెట్టినట్లు చెప్పాడు. ఇదిలావుండగా, బాలాఘాట్ జిల్లా ఆసుపత్రిలో మేలో ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అదేవిధంగా ఛతర్‌పూర్‌ పరిధి గుల్‌గంజ్‌లోని అంగౌర్ గ్రామానికి చెందిన మంకి కుష్వాహా అనే మహిళ.. ఆగస్టు 27న ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. 

భార్యపై కోపం.. ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్లి మరీ మహిళ పేరుతో ఓ సిమ్‌ను కొని ఓ భర్త మాస్టర్ ప్లాన్.. చివరకు..



Updated Date - 2022-09-03T22:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising