ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఫొటోలు పంపిన యువతి.. మరుసటి రోజు తన వాట్సప్‌కు వచ్చిన వీడియో చూసి షాక్..
ABN, First Publish Date - 2022-09-21T20:56:18+05:30
నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ చాలా మంది మోసాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఇలాంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి..
నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ చాలా మంది మోసాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఇలాంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏమాత్రం అమాయకంగా ఉన్నా.. ఇట్టే మోసం చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి ఫొటోలు పంపింది. అయితే ఆ మరుసటి రోజు తన వాట్సప్‌కు వచ్చిన వీడియో చూసి షాక్ అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇటీవల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఫేస్‌బుక్‌లో (Facebook) కేరళకు చెందిన నిధీష్ చంద్రన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్న తర్వాత.. తన ఉద్యోగ ప్రయత్నాల గురించి యువకుడికి తెలియజేసింది. దీంతో తాను ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెకు హామీ ఇచ్చాడు. తర్వాత ఆమె చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఫొటోలను అతడికి పంపించింది. అయితే మరుసటి రోజు తన వాట్సప్‌కు ఓ అశ్లీల వీడియో (Indecent video) వచ్చింది.
అక్కా! నీతో మాట్లాడాలి.. అంటూ కారులో ఊరి బయటకు తీసుకెళ్లాడు.. తన మాటకు అభ్యంతరం చెప్పడంతో చివరకు..
అందులో తనను తాను చూసుకుని షాక్ అయింది. వెంటనే సదురు వ్యక్తి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఇలా పలు దఫాలుగా డబ్బులు అడుగుతూనే ఉండడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. డబ్బుల కోసం ఆశపడి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకొన్నాడు. గతంలో పలువురు యువతులను ఇలాగే మోసం చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నా కూతుర్ని ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడిన స్క్రీన్ ప్లే..
Updated Date - 2022-09-21T20:56:18+05:30 IST