ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేనమామ ఇంటికి వెళ్లిన మేనల్లుడు... సరదాగా మేడపైకి వెళ్లి ఫోన్‌లో మాట్లాడుతుండగా..

ABN, First Publish Date - 2022-04-28T16:20:11+05:30

అనూహ్యంగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని ఘటనలు విషాదాన్ని నింపుతుంటాయి. అంతవరకు కళ్ల ఎదుట సంతోషంగా...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనూహ్యంగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని ఘటనలు విషాదాన్ని నింపుతుంటాయి. అంతవరకు కళ్ల ఎదుట సంతోషంగా గడిపిన వారు.. దురదృష్టవశాత్తు  అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకొంటుంటారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇలాంటి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మేనమామ గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లిన మేనల్లుడు.. సరదాగా మేడపైకి వెళ్లా్డు. అంతలోనే ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అదే సమయంలో చోటు చేసుకున్న అనూహ్య ఘటన.. అందరినీ శోకసంద్రంలో ముంచేసింది... ఏం జరిగిందంటే..


జార్ఖండ్ రాష్ట్రం పాలము జిల్లా మేదినీనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సత్సంగ్ భవన్ రోడ్డులో నివాసం ఉంటున్న అనిల్ దూబే  అనే వ్యక్తి ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం పూర్తి చేశాడు. గృహ ప్రవేశ కార్యక్రమం ఉండడంతో బంధువులందరనీ ఆహ్వానించాడు. అనిల్ దూబే మేనల్లుడైన.. పహాడ్ గ్రామానికి చెందిన నందన్ తివారీ(24) కూడా కార్యక్రమానికి హాజరయ్యాడు. బుధవారం రాత్రి బంధువులందరితో సంతోషంగా గడిపాడు. కొత్త ఇల్లు మొత్తం చూసే క్రమంలో మేడపైకి వెళ్లాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉన్నాడు.

వెళ్లి వేడుకలో వరుడి ప్రవర్తన చూసి వధువు తండ్రి షాకింగ్ నిర్ణయం.. అదే ముహూర్తానికి కూతురికి వేరే వ్యక్తితో..


రాత్రి కావడంతో మేడపైన ఏమీ కనిపించలేదు. అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుండగా.. అనుకోని ప్రమాదం జరిగింది.  అనిల్ దూబే ఇంటిపై చేతికందే ఎత్తులో హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. నందన్ తివారీకి ఈ ప్రాంతానికి కొత్త కావడంతో చూసుకోలేదు. ఫోన్ మాట్లాడే క్రమంలో వైర్లు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన బంధువులు, స్థానికులు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే యువకుడి మృతదేహం కాలిపోతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తన సోషల్ మీడియా అకౌంట్‌లో అసభ్యకర వీడియోలను చూసి ఖంగుతిన్న టీచర్.. దీనిపై ఆరాతీయగా చివరకు ఏం తెలిసిందంటే..

Updated Date - 2022-04-28T16:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising