ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నా చావుకు కారణమిదేనంటూ లేఖ రాసి మరీ 28 ఏళ్ల యువతి బలవన్మరణం

ABN, First Publish Date - 2022-06-21T22:24:22+05:30

ఆడపిల్లలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో చోట బాలికలు, యువతులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ప్రేమ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆడపిల్లలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో చోట బాలికలు, యువతులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ప్రేమ పేరుతో నమ్మించి, చివరకు మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. మోసపోయామని తెలుసుకున్న యువతులు.. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రం పాట్నాలో ఇలాంటి ఘటనే జరిగింది. అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నా చావుకు కారణమిదేనంటూ ఓ 28ఏళ్ల యువతి బలవర్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే..


జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకు చెందిన ఉషా రాణి(28).. బీహార్ రాష్ట్రం పాట్నాలోని ఎయిమ్స్‌లో నర్సుగా పని చేస్తోంది. బృందావన్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న ఆమె.. సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గదిలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కంగారుగా ఇంటికొచ్చిన కూతురు.. ఏడుస్తూ.. అమ్మా!.. ఊరి బయట పొలంలో... అంటూ ఆమె చెప్పింది విని..


అందులో.. ‘‘సారీ మా, క్షమించండి బాబా, నా మరణానికి కారణం శీతల్ టోప్పో కుమారుడు అమిత్ టోప్పో మాత్రమే’’.. అని రాసి ఉంది. అమిత్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం కారణంగా ఉషా రాణి.. ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉష తండ్రి విల్చస్ లక్రాకు సమాచారం అందించారు. యువతి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా?.. లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా?.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

బస్సు డ్రైవర్‌ను ప్రేమించిన యువతి.. కొన్నాళ్లకు తన జీవితంలోకి ఎంటరైన మరో వ్యక్తి.. చివరికి రెండో ప్రేమికుడితో కలిసి..

Updated Date - 2022-06-21T22:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising